శరీర ఫిట్‌నె్‌సకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో మంచివంటున్నారు నిపుణులు. నిత్యం వాటిని సాధన చేయమని సూచిస్తున్నారు.
కరాటే, జూడో, టైక్వాండొల్లాంటి మార్షల్ ఆర్ట్సే కాకుండా మోడరన్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఎ)ను కూడా నగరాల్లోని జిమ్స్‌లో నేర్పుతున్నారు. ఇంతకూ మార్షల్ ఆర్ట్స్ వల్ల ప్రయోజనాలేమిటంటారా?
వీటిని సాధన చేయడం వల్ల ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసం వస్తుంది.
ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. మైండ్, బాడీ, స్పిరిట్ మూడూ కలిసి పనిచేస్తాయి. ఆత్మరక్షణకు సహకరిస్తాయి. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటారు. క్రమశిక్షణతో మసలుకుంటారు. ఒత్తిడిని సైతం అధిగమిస్తారు.
మెదడు సైతం చురుగ్గా పనిచేస్తుంది. కుంగ్‌ఫూ, కరాటే, జూడో, సవాటే, అకిడో, ఎస్‌క్రిమా, కెంజుట్సు, క్రావ్‌మగ, బాక్సింగ్, రెజ్లింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్.... ఏవి నేర్చుకున్నా శరీరాన్ని, మెదడును ఇవి ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి.
ప్రయోజనాలు...
పరిసరాల పట్ల స్పృహ పెరుగుతుంది.
బాగా వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది.
ఒత్తిడిని అధిగమిస్తాం.
ఆత్మవిశ్వాసంతో మెలుగుతాం.
ఎల్లవేళలా అప్రమత్తతో ఉంటాం.
మెదడు, శరీరం రెంటి మధ్య సహకారం వృద్ధిచెందుతుంది.