చర్మ సౌందర్యాన్ని దెబ్బతీసే ఒత్తిడి......

ఒత్తిడి..... మహా ప్రమాదకరమైన పదం. పైకి కనిపించకపోయినా ఇది చేసే నష్టం అంతా ఇంతా కాదు. ఒత్తిడి కారణంగా బిపి,గుండెజబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయని మనకు తెలుసు. అయితే ఇది చర్మ సౌందర్యం మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని తెలిసింది. 

చర్మం పొడిబారటం,ముడుతలు పడటం,అకాల వృద్దాప్యం,మాయశ్చరైజర్ ఎక్కువగా రాయటం వంటి లక్షణాలు తీవ్రమైన ఒత్తిడిని సూచిస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఒత్తిడిని అదికమించటంతో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా పరిరక్షించుకోవచ్చు.

పోషకాహారం తీసుకోవటంతో పాటు రెగ్యులర్ గా వ్యాయామం చేయటం ద్వారా కూడా ఒత్తిడిని అదికమించవచ్చు. అంతేకాక సౌందర్య సాదనలు వాడటం ద్వారా కూడా చర్మం పూర్వపు కాంతిని,నిగారింపు ను పొందవచ్చు. 

ఆహారంలో ఒమేగా 3 ఆహారాలు ఉండేలా చూసుకోవాలి. ఇది గోళ్ళు,జుట్టు,చర్మాన్ని పరిరక్షిసుంది. నీటికి ఒత్తిడిని తగ్గించే శక్తి కూడా ఉంది. అందువల్ల రోజు మొత్తంలో తగినంత నీటిని త్రాగటం అలవాటు చేసుకోండి.

మెడిటేషన్,అరోమా థెరపి ద్వారా తేలికగా ఒత్తిడిని అదికమించవచ్చు. మెడిటేషన్ మెదడును చురుకుగా,ప్రశాంతముగా ఉంచుతుంది. అరోమా దేరపి అలసిన శరీరానికి స్వాంతన చేకూరుస్తుంది. సంపూర్ణ స్నానం వలన కూడా కొంత వరకు ఒత్తిడి తగ్గుతుంది.

 అలాగే చర్మం మిల మిలా మెరుస్తూ ఉంటుంది. స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల రోజ్,లావెండర్,వెనిలా నూనెలు కలుపుకోవాలి. ఇవి దుర్వాసనను పోగొట్టి సంపూర్ణ స్నానం చేసిన అనుభూతిని కలిగిస్తాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top