నాజుకైనా నడుము కోసం

అధిక బరువు తగ్గి నడుము సన్నగా,నాజుగ్గా ఉండటానికి వేల కొద్ది క్రంచెస్, సిట్టాప్స్ కానీ చేయవలసిన అవసరం లేదు. అలాగే గంటల కొద్ది జిమ్ లో గడపవలసిన అవసరం లేదు. వ్యాయామం ఒక్కటే అధిక బరువును తగ్గిస్తుందనేది ఒక అపోహ మాత్రమే అని నిపుణులు చెప్పుతున్నారు. వ్యాయామం చేస్తూనే ఆహారపు అలవాట్లను మార్చుకోవటం ద్వారా కూడా పలితాన్ని పొందవచ్చు.

బరువు తగ్గి నాజుగ్గా ఉండాలని అనుకునే వారు అర్ధరాత్రి వరకు జరిగే పార్టీలకు గుడ్ బై చెప్పాలి. రాత్రి పొద్దుపోయేదాకా మేలుకొని ఉండటం,నిద్ర సరిపోకపోవటం వంటి కారణాలు శరీరంలో అసమానతలకు కారణం అవుతాయి. ఇవి శరీర బరువు అధికం కావటానికి దోహదం చేస్తాయి. 

రాత్రి సమయంలో ఏడు నుంచి ఎనిమిది గంటల దీర్ఘ నిద్ర పోవటం తప్పనిసరి. రాత్రి సమయంలో పార్టికి వెళ్ళవలసి వచ్చినా తొందరగా ఇంటికి వచ్చి నిద్ర పోవటం మంచిది. భోజనం చేసిన వెంటనే నిద్ర పోవటం మంచిది కాదు. ముఖ్యంగా రాత్రి సమయంలో త్వరగా భోజనం ముగించి పావు గంట నడవటం అలవాటు చేసుకోండి. బయటకు వెళ్లి నడవలేని వారు ఇంటిలోనే నడవవచ్చు.

అధిక బరువు తగ్గించుకోవటానికి ఉపవాసాలు ఒక్కటే సరైన మార్గమని చాలా మంది భావిస్తారు. ఇది కేవలం ఒక నిరుత్సాహం నుంచి వచ్చిన ఆలోచన తప్పించి,ఇది సరైన ఆలోచన కాదు. భోజనం మానివేయుట వలన బరువు పెరుగుతారు. 

అధిక బరువు తగ్గాలని అనుకునేవారు రోజు మొత్తంలో బోజనంను ఆరు భాగాలుగా చేసుకొని తీసుకోవాలి. రోజు మొత్తంలో 2000 కేలరీలు తీసుకుంటే వాటిని ఆరు సమ భాగాలుగా విభజించాలి. ఒక్కోసారి 350 నుంచి 400 కేలరీల ఆహారాన్ని తీసుకోవాలి.

నీటితో బరువు తగ్గటం ఏమిటని ఆశ్చర్య పడనక్కరలేదు. నిద్ర లేవగానే లీటర్ నీరు త్రాగాలి. ఇంత మొత్తంలో నీరు త్రాగటం వలన శరీర ప్రక్రియ క్రమబద్దం అవుతుంది. ఖాళీ కడుపుతో నీరు త్రాగటం వలన శరీరం లోని టాక్సిన్ లు బయటకు వెళ్ళటానికి దోహదం చేస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top