మహిళలకు మోనోపాజ్ అనేది వరమా శాపమా?

స్త్రీ జీవితంలో అతి ముఖ్యమైన రెండవ ఘట్టం మోనోపాజ్ అని చెప్పవచ్చు. నెలసరి రుతుక్రమం ఆగిపోవ డాన్నే మోనోపాజ్(ముట్లుడిగిపోవటం) అని అంటారు. మోనోపాజ్ 45 నుంచి 50 సంవత్సరాల మధ్య సంభవించే శారీరక పరిణామం. మోనోపాజ్ కి వచ్చిన స్త్రీకి ఇంకా పిల్లలు కలిగే అవకాశం ఉండదు. ఆమె అండాశయంలో అండం విడుదల అవటం ఆగిపోతుంది. మోనోపాజ్ చేరువైన స్త్రీ శరీరంలో ఈ మార్పు ఒక్కటే కాకుండా  పలు మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే స్త్రీలందరికి ఈ సమస్యలు లేకపోయినా,ప్రతి పది మందిలో కనీసం ఎనిమిది మంది స్త్రీలు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు.

సాదారణంగా స్త్రీలలో మోనోపాజ్ లక్షణాలు 40 సంవత్సరాల నుండి ప్రారంభమవుతాయి. కొందరికి కొంచెం ఆలస్యంగా కూడా కనిపించవచ్చు. అప్పటి దాక క్రమంగా వచ్చే రుతుక్రమంలో అసమానతలు చోటు చేసుకుంటాయి. అంటే నెల నెల కాకుండా రెండు నెలలకు ఒకసారి రుతుక్రమం రావచ్చు. అయితే ఒక్కోసారి ఆరు నెలలకు ఒకసారి కూడా రుతుక్రమం రావచ్చు. దీనికి హార్మోన్స్ లో వచ్చే మార్పులే కారణం. రుతుక్రమం సమయంలో అయ్యే బ్లీడింగ్ కూడా తగ్గిపోతుంది. తరచూ తలనొప్పి రావటం,చెవుల్లో శబ్దాలు వినిపిస్తూన్నట్లు అనిపిస్తుంది.

కాళ్ళు,వెన్ను నొప్పితో పాటు అరి చేతుల్లోను,పాదాల్లోను మంటలు రావవచ్చు. చర్మం పొడిగా మరి ముడతలు ఏర్పడే అవకాశం ఉంది. తీవ్రమైన ఒత్తిడితో పాటు అనవసరమైన ఆందోళన కూడా ఉంటుంది. నిద్రలేమి,ఆకలి లేకపోవటం,ఆసక్తి లేకపోవటం,ఏకాగ్రత లేకపోవుట,చికాకు వంటి లక్షణాలను మోనో పాజ్ లక్షణాలుగా చెప్పవచ్చు.

ఈ సమస్యల పరిష్కారం కొరకు కొన్ని సూచనలను పాటిస్తే అదికమించవచ్చు. ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. జిమ్ కి వెళ్ళలేని వారు ప్రతి రోజు గంట సేపు నడవటం అలవాటు చేసుకోవాలి. యోగ,మెడిటేషన్ వంటివి చేయటం మంచిది. ఇలా నడవటం వలన స్థూలకాయం తగ్గటంతో పాటు ఒత్తిడి,ఆందోళన నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. ఉదయం లేవగానే పరకడుపున గోరువెచ్చని నీటిని త్రాగాలి. రోజు మొత్తంలో ఘన పదార్ధాలు కన్నా ద్రవ పదార్దాలను ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు,పైబర్ ఎక్కువగా ఉన్న కూరగాయలను తీసుకోవాలి. పిండి పదార్దాలను తక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న పాలు,గుడ్లు,పెరుగు,చేపలు వంటివి ఎక్కువగా తీసుకోవటం అలవాటు చేసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top