ప్రసవం అనంతరం బరువు తగ్గాలంటే...

స్త్రీ గర్భవతిగా ఉన్న సమయంలో బరువు పెరగటం ఎంత సహజమో... ప్రసవం అనంతరం బరువు ఉండటం కూడా ఆరోగ్యరీత్యా కూడా మంచిది కాదు. గర్భాధారణ సమయంలో దాదాపు 12 కిలోల బరువు పెరుగుతారు. అయితే చాలా సందర్భాలలో ప్రసవం అనంతరం పెరిగిన బరువు తగ్గిపోయి సాదారణ బరువుకు వచ్చేస్తారు. కొంత మంది విషయంలో మాత్రం ఆ బరువు ఆలా ఉండిపోతుంది. కొందరిలో శరీరం మొత్తం ఊబకయము వస్తే కొంత మందికి మాత్రం చేతులు మాత్రమే లావుగా ఉంటాయి. చాలా మందిలో పిరుదులు,పొట్ట,నడుము భాగంలో లావు ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతాల్లో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకొని సాదారణ స్థితికి రావటం అనేది కొంచెం కష్టమైన పని అయినప్పటికీ ఆసాధ్యం కాదు. ఈ విధంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటానికి,బరువు తగ్గటానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాము.
* మానేసిన వ్యాయామంను తిరిగి ప్రారంభించాలి. అయితే ప్రసవం అయిన ఆరు వారాల తర్వాత మాత్రమే వ్యాయామాలు చేయాలి. అది కూడా డాక్టర్ సలహా మీదే చేయాలి.
* కొన్ని నెలల తర్వాత వ్యాయామం చేస్తున్నారు కాబట్టి భారీ వ్యాయామం జోలికి పోకూడదు. ముందుగా పదిహేను నుంచి ఇరవై నిముషాలు జాగింగ్,వాకింగ్ లాంటివి చేస్తే మంచిది. ఆరు  వారాల తర్వాత జిమ్ కి వెళ్ళటం చేయవచ్చు. ఇవే కాకుండా యోగ,మెడిటేషన్ వలన కూడా బరువు తగ్గుతుంది.
* రోజులో  తీసుకొనే ఆహారాన్ని ఐదారు సమ భాగాలుగా చేసుకొని తినాలి. ఆకుకూరలు,పండ్లు తీసుకుంటూ పిండి పదార్దాలను తగ్గించాలి. తీపి పదార్దాలు,జంక్ ఫుడ్ వంటి వాటిని బాగా తగ్గించాలి.
* నీరు త్రాగటం మాత్రం తగ్గించకూడదు. ఏ కాలమైన రోజుకి కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తప్పనిసరిగా త్రాగాలి.
* తల్లి పాలు పిల్లలకు ఎంత మేలు చేస్తాయో... పిల్లలకు పాలు ఇవ్వటం కూడా తల్లికి అంతే లాభం. పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు పెద్దగా వ్యాయామం జోలుకి వెళ్ళనవసరం లేదు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top