ఈ మధ్య ప్రతి ఆరు నెలలకూ ఒకసారి డెంటిస్ట్‌ను కలవాలని తరచు పేపర్లలో చూస్తుంటాను. అది నిజమేనా?

ఇప్పటికీ పంటినొప్పి వస్తేనే డెంటిస్ట్‌ను కలవాలని లేకుంటే అవసరం లేదని అందరూ భావిస్తున్నారు. ప్రతి వందమందిలో కేవలం నలుగురు మాత్రమే వారి జీవితకాలంలో దంతవైద్యుడిని తరచుగా కలుస్తున్నారు. మిగిలిన వారంతా, మాకు అవసరం లేదు అనుకుంటున్నారు. ఎందుకంటే దంతసమస్యల్లో కేవలం 30 శాతం జబ్బులకే నొప్పి ఉంటుంది. మిగిలిన డెబ్భైశాతం దంత సమస్యలకు నొప్పి ఉండదు. కాబట్టి నొప్పి ఉన్నా లేకున్నా ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఇంటిల్లిపాదీ డెంటిస్ట్‌ను కలిసి తగిన సలహాలు, సూచనలు పొందాలి. మనం చాలామందిలో చూస్తుంటాం... బ్రష్ చేసినప్పుడో, గట్టివస్తువులు కొరికినప్పుడో చిగుళ్ల నుంచి రక్తం రావడం, చిగుళ్లు కిందికి జారినట్లు అనిపించడం, చిన్న వయసులోనే పళ్లు వదులైనట్లు అనిపించటంలాంటివన్నీ చిగుళ్లకు సంబంధించిన జబ్బులే. వీటిలో ఎక్కడా పంటినొప్పి ఉండదు. అలాగే మరొక ప్రధాన సమస్య నోటి దుర్వాసన. 

దీనివల్ల కుటుంబ సభ్యులో లేదా పక్కవారో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. ఇటువంటి సమస్యలన్నీ మనకు మనంగా గుర్తించలేకపోవచ్చు. కాబట్టి పంటినొప్పి లేనంత మాత్రాన మీకు సమస్యలు లేవని కాదు. ప్రతి ఆరునెలలకోసారి డెంటిస్ట్‌ను కలిసి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ పళ్లను జీవితకాలం దృఢంగా కాపాడుకునే అవకాశం ఉంది. చాలాకాలంగా డెంటిస్ట్‌ను కలవని వారిలో ఏదో ఒక రకమైన చిగుళ్ల జబ్బు ఉండే అవకాశం ఉంది. అలాగే ఎంతోమంది చిన్నపిల్లల్లో పళ్లు సరిగ్గా రాకపోవడం, పాలపళ్లు ఊడిపోకుండానే శాశ్వత దంతాలు రావడం, రెండు వరుసల్లో పళ్లు ఉండటం, పుచ్చుపళ్లతో బాధపడుతుండటం చూస్తుంటాం. వీళ్లందరూ క్రమం తప్పకుండా డెంటిస్ట్‌ను కలుస్తూ, తగిన చికిత్సలు పొందటం మంచిది. 

అలాగే చిన్నవయసు నుంచి వచ్చే ఎత్తుపళ్లు, వంకరపళ్లు, దవడ ఎదుగుదలలో లోపాలను సర యిన సమయంలో గుర్తించగలిగితే చికిత్స సులువుగా ఉంటుంది. అదేవిధంగా బీపీ, షుగర్, గుండెజబ్బులతో బాధపడేవారు డెంటిస్ట్‌ను కలవడానికి జంకుతుంటారు. నిజానికి ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారే నోటి ఆరోగ్యం పట్ల ప్రత్యేకశ్రద్ధ పెట్టాలి. ఇంతేకాదు, మనం రోజూ పళ్లు తోముకునే బ్రష్‌ను రోజుకు ఒకటి లేదా రెండుసార్లే వాడతాం కదా! ఇంకా పాడైపోలేదులే అని చాలామంది చాలాకాలంపాటు వాడేస్తుంటారు. ఇది మంచిది కాదు. పళ్లు తోముకునే బ్రష్‌ను తప్పనిసరిగా ప్రతి మూడు లేదా నాలుగు నెలలకొకసారి మార్చెయ్యాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top