ఉబ్బసంతో తస్మాత్‌ జాగ్రత్త!

ఉబ్బసం అంటే వంశపారపర్యంగా సంక్రమించే శరీరతత్వాలు, వాతావరణంలో మార్పులు, కాలుష్యం, ఇంటిబూజు, దుమ్ము, ధూళి, పొగ, రసాయనాలు, సెంటులు, పుప్పొడి, కొన్నిరకాల మందులు, చివరికి మానసిక ఒత్తిడులు, భావోద్వేగాలు ఇవన్నీ ఊపిరి సలపని ఉబ్బసానికి దారి తీస్తాయి. ఈ ఉబ్బసం ఏ వయసువారినైనా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మనిషి గుండె నిబ్బరాన్ని దెబ్బతీస్తుంది. మనిషిని ప్రశాంతంగా బతకనివ్వక ఆర్థికంగా, శారీరకంగా, సామాజికంగా కృంగదీస్తుంది. ఈ తరుణంలో ఉబ్బసం వ్యాధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈవారం ‘హెల్త్‌గైడ్‌’లో హైదరాబాద్‌ హిమయత్‌నగర్‌లోని శ్వాస అలర్జీ ఆస్తమా సెంటర్‌ వైద్యులు డాక్టర్‌ వీరపనేని విష్ణురావు వివరిస్తున్నారు. 

ఉబ్బసం అనేది ఊపిరితిత్తులలోని వాయునాళాలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధి. వాయునాళాలు మూసుకుపోయి గాలి పీల్చడం, వదలడం కష్టంగా మారుతుంది. దీనినే ఆస్తమా, అలర్జీ, ఇస్నోఫీలియా, డ స్ట్‌ అలర్జీ, సర్ది, ఆర్తి, ఆయాసం అనే రకరాల పేర్లతో పిలుస్తుంటారు. 

ఉబ్బసం వ్యాధి లక్షణాలు...
పిల్లలకు చీటికీ, మాటికీ జలుబు చేయడం, ఆసుపత్రుల చుట్టూ తిరగడం, అది ఎంతకీ తగ్గకపోవడం, తగ్గినా మళ్లీమళ్లీ రావడం, దగ్గు, ఆయాసం, గొంతులో గరగర, నిద్రలేక పోవడం, పాలు తాగలేక పోవడం, తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఆస్థమా, అలర్జీ లక్షణాలు ఉంటే అది పాల ఉబ్బసం కావచ్చు. దీనిని తొలిదశలోనే అరికట్టాలి. లేదంటే పూర్తిస్థాయి ఉబ్బసానికి దారి తీయవచ్చు. దుమ్ము, ధూళి, పొగ, ఇంకా ఏది సోకినా వరుసగా తుమ్ములు రావడం, ముక్కు చీదడం, కారడం జరుగుతుంటాయి. ఇవన్నీ అలర్జీ-ఆస్తమా లక్షణాలే.

ఆస్తమా ఎవరిలో వస్తుంది...
80శాతం మంది ఉబ్బసం రోగుల్లో ఈ వ్యాధి వారికి 18 సంవత్సరాల వయసులోనే మొదలవుతుంది. ముఖ్యంగా బాల్యదశలోనే (10 సంవత్సరాలలోపు) ఈ వయసులో ఉండాల్సిన పెరుగుదల ఆగిపోతుంది. ఆటలాడలేరు. చద వాలని ఉన్నా చదవలేకపోతారు. యువతీయువకులు స్నేహితులతో సరిగ్గా కలవలేరు. ఆస్తమాకు నకిలీ నాటు వైద్యాల వల్ల పెరిగేది అనారోగ్యం అన్న విషయాన్ని గుర్తుం చుకోవాలి. ఉబ్బసానికి వైద్యం రోగులను మభ్యపెట్టేదిగా, అనారోగ్యాన్ని ఇంకా పెంచేలా ఉండకూడదు. అర్థం పర్ధం లేని అశాస్ర్తీయ, నకిలీ నాటు వైద్యాలు, చేప మందులు, పౌడర్‌ మందులు, పసరు ఉండలు, రంగునీళ్లు ఉబ్బసం రోగిలో ఆవగింజంత మార్పును కూడా కలిగించలేవు. నాటువైద్యానికి, ఉబ్బసానికి ఎలాంటి సంబంధంలేదు.

శాస్ర్తీయ వైద్యం ఏమిటి ?
ఉబ్బసం రోగులు ఆనందంగా, ఆరోగ్యంగా, అందరిలా శాస్ర్తీయంగా జీవించాలంటే శాస్ర్తీయమైన ఏకైక మార్గం ‘ఇన్‌హేలర్‌ థెరపీ’ మాత్రమే. పూర్తి అవగాహనతో ఈ మందులు వాడగలిగితే ఇవి పూర్తిగా సమర్థవంతమైనవి. సురక్షితమైనవి. వీటిపై అపోహలు, అనుమానాలు కేవలం వీటి గురించి తెలియక, తెలుసుకోక, తెలియచెప్పకపో వడం వల్ల మాత్రమే ఏర్పడుతాయి. హిమయత్‌నగర్‌లోని శ్వాస అలర్జీ, ఆస్తమా సెంటర్‌లో కంప్యూటర్‌ పరీక్షల ద్వారా ఉబ్బసం వ్యాధి తీవ్రతను, ఊపిరితిత్తుల పనిత నాన్ని తెలుసుకుని ఏ మందులు, ఏ మోతాదులో, ఎంతకాలం వాడాలో తెలియచేస్తారు. పసి పిల్లలు మొదలుకుని వేలాదిమంది ఉబ్బసం రోగులు ఈ కేంద్రంలో ఇన్‌హేలర్‌ థెరపీ ద్వారా ఉబ్బసాన్ని జయించి సాధారణ జీవితం గడుపుతున్నారు.

ఉబ్బసం రోగుల బాధలు-పరిష్కారం
ఉబ్బసం రోగులు పడే బాధలు, ఇక్కట్లు, ఇబ్బందులు, అవమానాలు, అగచాట్లు, రోదన, మనోవేదన వారికి మాత్రమే తెలుసు. ఈ బాధలను పూర్తిగా అర్థం చేసుకుని వారిలో ఆత్మవిశ్వాసం నింపుతూ ఉబ్బసం రోగి కన్నీటిని తుడిచి వారి జీవితంలో కొత్త వెలుగులు నింపాలి. ఏ వయసు వారికి ఏ ఇన్‌హేలర్‌, ఏ మోతాదులో, ఎంత కాలం వాడాలన్నదే కీలకసూత్రం. తాళం రావాలంటే దానికి తగ్గ తాళం చెవి ఉప యోగిస్తేనే తెరుచుకుం టుంది. అలాగే ఏ వ్యాధి అయినా దానికి తగ్గ మందు సరిగా వాడితేనే ఫలితం ఉంటుంది. ఈ విషయా లను రోగులు, వారి కుటుం బ సభ్యులకు వివరించి సరైన శాస్ర్తీయ వైద్యం సకాలంలో 
అందిస్తూ వారి కుటుంబాల్లో సుఖశాం తులను కలుగ చేసేందుకు శ్వాస ేంద్రం కృషి చేస్తోంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top