కర్రవిరగ కూడదు పాము చావాలి! ఏ సందర్భంలో వాడతారు.

అత్యంత లౌక్యంగా వ్యవహరించాల్సిన సందర్భాన్ని సూచించే సామెత ఇది. ఇంటి పరిసరాల్లో కాని, పొలాల్లో కాని పాము కనిపిస్తే ఏం చేస్తాం! మనకు ధైర్యం ఉంటే వెంటనే చంపేస్తాం లేదా పాములను పట్టడంలో నిపుణులైనవారి సహాయం తీసుకుంటాం. కర్రతో కొట్టి చంపేటప్పుడు పాము చావడమే ప్రధాన ఉద్దేశం. అంతే తప్ప, కర్ర విరగకూడదన్న ఆలోచన ఉండదు. అలా కాకుండా పామును చంపడానికి ఉపయోగించే కర్ర కూడా వృథా కాకుండా పాము బాధ వదిలించుకోవాలని ప్రయత్నించేవాళ్లూ ఉంటారు. 

వాళ్లు ప్రయత్నించడమే కాకుండా పామును చంపే నిపుణుడికి ఇలాంటి సూచన చేస్తారు. ఇది సాధ్యమా అంటే... ఏ మాత్రం కాదు. చాలా కష్టమైన పనే. దీనిని సుసాధ్యం చేయడానికి చాలా నైపుణ్యం ఉండాలి. అంతకుమించిన యుక్తి ఉండాలి. పాము ఒంటిమీద దెబ్బ ఏ ప్రదేశంలో పడితే ఇక పైకి లేవకుండా అచేతనంగా పడిపోతుందో ఆ ఒడుపు తెలియాలి. అంతే కచ్చితంగా కర్రమీద బలాన్ని ప్రయోగించాలి. అంటే శక్తియుక్తులన్నీ ప్రయోగించాల్సి ఉంటుందన్నమాట. ఈ సామెతను ఒక కీలకమైన వ్యవహారాన్ని ఏ మాత్రం నష్టం లేకుండా పూర్తి చేయాలని చెప్పే సందర్భంలో వాడతారు.  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top