అసలు పొట్ట ఎందుకు వస్తుందంటే...

స్వాతంత్య్రం రాకమునుపు మన దేశంలో తరచూ కరవులు వస్తుండేవి. దేశంలో వచ్చిన బెంగాల్ కరవు, మన రాష్ట్రంలో వచ్చిన డొక్కల కరవు చాలా ప్రసిద్ధాలు. ఈ కరవు వచ్చిన చోట రోడ్డుకు ఇరుపక్కల మృతదేహాలు గుట్టలు గుట్టలుగా పడి ఉండేటంత తీవ్రంగా ఈ కరవులు ఉండేవి. అయితే ఆహారం దొరకని ప్రాంతాల్లో అది దొరికినప్పుడే అదనపు ఆహారాన్ని కొవ్వురూపంలో నిల్వ ఉంచుకునేలా శరీరం తయారవుతుంది. మనుగడ కోసం జీవులు అనుసరించే ‘అడాప్టేషన్’ ప్రక్రియలో భాగంగా ఇది జరుగుతుండేది. అందుకే 17, 18వ శతాబ్దాల్లో కరవులు తరచూ వచ్చే సమయంలో వాటిని అధిగమించి మనుగడ సాధించేందుకు వీలుగా మన దేశవాసుల్లో... (ప్రధానంగా దక్షిణభారతదేశ వాసుల్లో) ఒక జన్యుపరివర్తన జరిగింది. 

ఆ జన్యువు ప్రాబల్యంతో ఒక వయసు తర్వాత పొట్టచుట్టూ కొవ్వు పేరుకునే ప్రక్రియ జరుగుతుండటం... ఆ కొవ్వును ఆహారం దొరకని సమయంలో వినియోగించుకోడానికి వీలుగా జన్యుపరివర్తన సంభవించిందని దక్షిణ భారత దేశ జన్యుపటలంపై అధ్యయనం చేసిన కొందరి సిద్ధాంతమిది. అందుకే మన దేశవాసుల్లో ప్రధానంగా దక్షిణభారతీయుల్లో పురుషులకైనా, మహిళలకైనా ఒక వయసు తర్వాత పొట్టరావడం మామూలైపోయింది. పైగా ఇప్పుడు హరితవిప్లవం తర్వాత ఆహార ధాన్యాల లభ్యత పెరగడం, దేశంలోని ఒక చోటి నుంచి మరొక చోటికి ఆ ధాన్యాల రవాణా సులభం కావడంతో కరవులు తగ్గిపోయాయి. అయితే మనలోని పొట్ట వచ్చేందుకు దోహదపడే జన్యు కారణంగా పొట్ట రావడం మాత్రం సాధారణమైపోయింది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top