సిక్స్ ప్యాక్ ఎలా ప్రమాదం...

ఇప్పుడు మనం సిక్స్ ప్యాక్ వల్ల కలిగే ప్రమాదమేమిటో తెలుసుకుందాం. మన దేశవాసుల్లో ఒక దశ తర్వాత పొట్ట రావడం జన్యుపరంగానే జరుగుతుందని తెలుసుకున్నాం కదా. మనం ఒక పక్క మన పొట్టపైన కండరాలను పైకి తేలించేందుకు వీలుగా తీవ్ర వ్యాయామం చేస్తుంటాం. ఆ వ్యాయామం కేవలం పొట్టపైన ఉన్న కొవ్వును మాత్రమే గాక... శరీరంలోని ఇతర ప్రాంతాల్లోని కొవ్వునూ దహనం చేస్తుంటుంది. మన శరీరంలోని కొవ్వు ... కొన్ని ప్రాంతాల్లో ఉదాహరణకు ముఖం గుండ్రగా కనిపించడం కోసం, భుజాలు కుదురుగా, గుండ్రగా కనిపించడం కోసం కొవ్వు పేరుకుంటుంటుంది. పొట్ట వద్ద దహించడానికి కొవ్వు లభ్యం కాని పరిస్థితుల్లో అప్పటికీ తీవ్రమైన వ్యాయామం కొనసాగుతున్నప్పుడు మరి దహించడానికి కొవ్వు లభ్యం కాని సమయంలో ముఖంపైనా, భుజాల్లోనా లేదా కీలక అవయవాల రక్షణ కోసం ఉన్న కొవ్వునూ ఈ వ్యాయామం దహించి వేస్తుంటుంది. 

అందుకే సిక్స్ ప్యాక్ కోసం తీవ్రంగా శ్రమించే వారి ముఖం, బుగ్గలలోని కొవ్వు పూర్తిగా దహనమైపోయి వారి బుగ్గలు లోపలికి పీక్కుపోయినట్లుగా ముఖం మారిపోతుంటుంది. దాంతో ఒక్కోసారి వృద్ధాప్యం ముందుగానే వచ్చినంతగా ముఖం మారిపోవచ్చు. లేదా రక్షణ అవసరమైన కీలక అవయవాల చుట్టూ ఉండే కొవ్వు దహించుకుపోయినప్పుడు అది కూడా ప్రమాదకరంగా మారవచ్చు. అందుకే వ్యాయామం ఎప్పుడైనా ఆరోగ్యాన్ని కాపాడేదిగా ఉండాలి తప్ప... మిమ్మల్నే దహించివేసేలా అనర్థదాయకంగా మారకూడదని గుర్తుంచుకోండి. అందుకే సిక్స్‌ప్యాక్ కోసం వ్యాయామం చేసేవారు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సంయమనంతో వ్యాయామం చేయాలి. తమ ముఖాకృతే మారిపోయేలా ఉంటే అంతటితో ఆ వ్యాయామాన్ని ఆపేయాలి. 

మరో విషయం ఏమిటంటే... ఒకసారి సిక్స్‌ప్యాక్ సాధించాక అది ఎప్పటికీ నిలిచిపోదు. దాన్ని నిలుపుకునేందుకు ఆ వ్యాయామాన్ని ఎప్పటికీ అలాగే కొనసాగిస్తూనే ఉండాలి. లేదంటే మన జన్యువుల ఆదేశాల ప్రకారం మళ్లీ పొట్ట చుట్టూ కొవ్వు చేరే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఈ లోపు ముఖం పరంగానూ, ఇతరత్రా ప్రమాదాల పరంగానూ జరగాల్సిన అనర్థం జరిగిపోతూనే ఉంటుంది. అందుకే సిక్స్‌ప్యాక్ కోసం కృషి చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top