మలబద్దకం పోవాలంటే ఏం తినాలి?

ప్రతిరోజు ఆహారంలో 30 గ్రాముల ఫైబర్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మలబద్దకం సమస్య తలెత్తుకుండా ఉంటుంది. అలాగే శరీరం డీ హైడ్రేట్ అయినపుడు మోషన్ ఫ్రీగా జరగదు. నొప్పి ఉంటుంది. పేగులలో కదలికలు తగ్గిపోతాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే రోజూ 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. ప్రతిరోజూ 300 నుంచి 400గ్రాముల కూరగాయలు తీసుకోవాలి. బీన్స్, బ్రొక్కోలి, క్యాబేజీ, క్యారెట్, పాలకూర వంటివి తీసుకోవచ్చు. బ్రౌన్ రైస్, బార్లీ, హోల్‌గ్రేన్ బ్రెడ్ తీసుకుంటే తగినంత ఫైబర్ లభిస్తుంది. పాప్‌కార్న్ తీసుకోవచ్చు.

ఇందులో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రూట్స్ విషయానికొస్తే పైనాపిల్, పియర్స్, పాపయ, బెర్రీ, ఆపిల్స్ తినొచ్చు. ఫ్రూట్స్‌ను పొట్టుతో పాటు తినేవి ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. 50 ఏళ్లు పైబడిన వారు రోజూ ఒక ఫ్రూట్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యం కాపాడుపోవచ్చు. డ్రై ఫ్రూట్స్ డైజెస్టివ్ సిస్టమ్‌కు మేలుచేస్తాయి. అప్రికాట్, డేట్స్ వంటివి బాగా ఉపకరిస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్(అవిసలు) పాలతోకానీ, ఇతర ధాన్యాలతో కలిపి గానీ తీసుకోవచ్చు. ఇందులో విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. మీరు ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మలబద్దకం సమస్య దూరమవుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top