Saturday, January 28, 2012

బీపీ ఎక్కువైతే...కడుపులో బిడ్డకు ప్రమాదమా?

ప్రెగ్నెన్సీలో ఐదవ నెల తర్వాత పెరిగే బీపీని ప్రెగ్నెన్సీ ఇన్‌డ్యూస్డ్ హైపర్ టెన్షన్ అని పిలుస్తాం. ఇది సాధారణంగా ఐదవ నెల లేక ఆ పై నెలల్లోనే పెరగడం ప్రారంభమైనా బీపీ పెరగడానికి కారణాలు మాత్రం పిండం ఏర్పడే ఆరు నుంచి పదవ వారం లోపలే కలుగుతాయని నిరూపితమైంది. మాయ (ప్లాసెంటా) ఏర్పడడంలో కలిగే మార్పులు, యాంటి ఫాస్ఫోలిపిడ్, యాంటీబాడీస్ వల్ల ప్రెగ్నెన్సీలో ఇలా బీపీ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. బీపీ 100/ 60 - 120/ 80 మధ్యలో ఉంటే నార్మల్‌గా ఉన్నట్లు, దీనికన్నా ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ వల్ల కలిగినదిగా గుర్తిస్తాం. మీరు రాసిన బీపీ వాల్యూస్ నార్మల్ కన్నా ఎక్కువగానే ఉన్నాయి. మీరు రెగ్యులర్‌గా డాక్టర్ చేత బీపీ చెకప్ చేయించుకోవడం ఎంతైనా మంచిది. బీపీ ఇలా పెరుగుతూ ఉన్నప్పుడు ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ ఎదుగుదల తగినంతగా లేకపోవడం, యూటిరస్‌లో గర్భస్రావం జరగడం, దానివల్ల బిడ్డకు ప్రాణాపాయం ఏర్పడడం వంటివే కాక అధిక బీపీ వల్ల తల్లికి ఫిట్స్ రావడం లేదా బ్లీడింగ్ కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. అందుచేత రెగ్యులర్‌గా బీపీ చెక్ చేయించుకుని డాక్టర్ సలహా మేరకు మాత్రలు వాడుతూ జాగ్రత్తలు తీసుకోవాలి.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
YourTextHere back to top