పిల్లలు పాలు, పళ్లు తీసుకోకపోతే......వారిని తినిపించడానికి కొన్ని సూచనలు.

కొందరు పిల్లలు పాలు తాగరు. పళ్లు తినరు. ఆకుకూరలు, కూరగాయల భోజనాన్ని అస్సలు ఇష్టపడరు. అలాంటి వారితో పాలు తాగించడానికి, పళ్లు తినిపించడానికి కొన్ని సూచనలు...

పిల్లలు ఇష్టంగా పళ్లు తినకపోతే వాటిని ఫ్రూట్ సలాడ్స్‌గా, కస్టర్డ్‌తో కలిపి పెట్టండి. జ్యూస్ రూపంలో ఇవ్వండి. పాలు తాగకపోతే మిల్క్‌షేక్ ఇవ్వండి. పాలతో తయారైన స్వీట్స్ తినిపించండి.


కూరగాయలు తినకపోతే... వెజిటబుల్ ఆమ్లెట్, గ్రిల్డ్ వెజిటబుల్ శాండ్‌విచ్... ఇలా రకరకాలుగా ఇవ్వండి.


మ్యాగీ వంటివి తింటుంటే... రకరకాల కూరగాయల ముక్కలను దానితో పాటు ఇవ్వండి. 


మాంసాహారం తినేవారైతే చేపలు, తినని వారు దాల్స్ తీసుకునేలా చేయండి.

బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటివి పిల్లలు ఇష్టంగా తింటారు. అవి క్రమం తప్పకుండా చేయడం ద్వారా పిల్లల్లో తినే అలవాటు పెంచవచ్చు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top