ఎంత వయసు పైబడినా యంగ్‌గా కనపడాలంటే......

1- న్యూట్రిషన్: ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉండే డైట్ తీసుకోవడం.

2- క్రమం తప్పని వ్యాయామం:
నిత్యం వ్యాయామం చేయడం వల్ల శరీరాన్ని దీర్ఘకాలం పాటు యంగ్‌గా ఉంచే హార్మోన్‌ల సపోర్ట్ లభ్యమవుతుంది. ఫలితంగా వయస్సు పైబడుతున్న లక్షణాలు చాలాకాలం పాటు కనపడవు.

3- అలవాట్లు:
పొగతాగడం, గుట్కా, ఆల్కహాల్ వంటి అలవాట్లు వాస్తవ వయస్సు కంటే ఎక్కువ వయస్సున్నట్లుగా కనిపించేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి ఆ అలవాట్లను తక్షణం వదులుకోవాలి.

4- మానసిక శిక్షణ:
పాజిటివ్ ఆలోచనలు, ధాన్యం (మెడినేషన్) వంటి ప్రక్రియలతో ఒత్తిడిని దూరంగా ఉంచుకోవడం వల్ల యంగ్‌గా కనిపించడం సాధ్యం.

5- మెడికేషన్ అండ్ సప్లిమెంట్స్: ఒకవేళ ఏవైనా మందుల్లాంటివీ, చికిత్స ప్రక్రియల్లాంటివి ఉపయోగించాల్సి వస్తే... అవి పై అంశాల తర్వాతే. హార్మోన్ థెరపీ, యాంటీఆక్సిడెంట్ సప్లిమెంట్స్ వంటి యాంటీ ఏజింగ్ ప్రక్రియలను అనుసరించాలి. అవి చేయాల్సి వస్తే... మెడికల్ స్పెషలిస్టులు, నిపుణులైన డాక్లర్ల పర్యవేక్షణలోనే చేయాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top