రక్తపోటును తగ్గించడానికి.........పుచ్చకాయ

రక్తపోటు (హైబీపీ)ని తగ్గించడానికి, నివారించడానికి సాధారణ జాగ్రత్తలతో పాటు మరో రుచికరమైన మార్గం కూడా ఉంది. సాధారణ స్థాయికి మించి హైపర్‌టెన్షన్ కనిపిస్తున్న వారు రోజూ పుచ్చకాయ తినడం మంచిది. దీనిలోని సిట్రులిన్ అనే పదార్థం మూసుకుపోతున్న రక్తనాళాలను తెరచి ఉంచేలా చేయగలదని అమెరికన్ సైంటిస్టుల పరిశోధనల్లో తెలిసింది. ఈ అధ్యయనం నిర్వహించే సమయంలో ఎంపిక చేసిన రోగులకు ఆరు వారాలపాటు పుచ్చకాయ ఇచ్చారు.

అదే సమయంలో కొందరికి దీన్ని ఇవ్వలేదు. అయితే పుచ్చకాయ తిననివారితో పోలిస్తే దాన్ని తీసుకున్నవారిలో రక్తపోటు సాధారణంగా ఉందని పరిశోధకులు గుర్తించారు. దీనిలో బీటా కెరోటిన్ (శరీరంలోకి ప్రవేశించాక ఇదే విటమిన్-ఏగా మారుతుంది), విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియంతో పాటు పీచుపదార్థాలు ఉన్నట్లుగా తెలిసింది. ఈ పొటాషియం కూడా రక్తపోటును నియంత్రించే అంశాల్లో ఒకటి కాబట్టి పుచ్చకాయ తినడం మంచిది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top