తేనె, దాల్చినచెక్క కలిపి తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య, సౌందర్య ఫలితాలు


తేనె, దాల్చినచెక్క కలిపి తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య, సౌందర్య ఫలితాలు ఉంటాయి. అవి...
 

* అధికబరువుతో ఇబ్బంది పడే వాళ్లు తేనె, దాల్చినచెక్క పొడిని ఒక కప్పు నీళ్లలో వేసి ఉడికించి ఉదయాన్నే పరగడుపున తాగాలి. రాత్రి నిద్రపోయేముందు కూడా తాగితే శరీరంలో కొవ్వు పేరుకుపోదు. కొన్ని రోజులు ఇలా చేసిన తరువాత బరువు చూసుకుంటే ఫలితం మీరే గమనించొచ్చు.
 

* కొద్దిగా తేనె తీసుకుని అందులో దాల్చిన చెక్క పొడి కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను రాత్రి పడుకునేముందు ముఖంపై ఉన్న మొటిమలపై పూయాలి. ఉదయాన్నే గోరు వెచ్చటి నీటితో కడగాలి. రెండు వారాల పాటు ఇలా చేస్తే మొటిమలు మాయమవుతాయి. చర్మం నిగారింపు వస్తుంది.
 

* అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవాళ్లు కొద్దిగా బ్లాక్‌టీ తీసుకుని అందులో దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి చల్లారిన తరువాత తాగాలి. ప్రతిరోజూ మూడు లేదా నాలుగు సార్లు ఈ టీ తాగితే కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోతుంది. గుండె సరిగా పనిచేస్తుంది. శ్వాసలో ఇబ్బందుల్ని అరికడుతుంది. రక్తప్రసరణ సరిగా జరుగుతుంది.

* కొన్ని గోరువెచ్చటి నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా తేనె, కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఆర్థరైటిస్ నొప్పి ఉన్న ప్రాంతాల్లో రాసుకుంటే పావుగంట నుంచి ఇరవై నిమిషాల్లో నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. దీర్ఘకాలికంగా ఆర్థరైటిస్‌తో బాధపడేవాళ్లు తేనె, దాల్చినచెక్క పొడులను సమపాళ్లలో తీసుకుని, ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లలో కలపాలి. క్రమం తప్ప కుండా నెల రోజుల పాటు ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయాన్నే తాగితే నొప్పి తగ్గడమే కాకుండా, సులభంగా తిరగగలుగుతారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top