ఎముకల బలాన్ని పెంచడానికి.......

పాలు తాగడం ద్వారానే ఎముకలు బలపడతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎముకల బలాన్ని పెంచడానికి టొమాటో రసం కూడా దోహదపడుతుందని కెనెడియన్ పరిశోధనల్లో తేలింది.

టొమాటోల్లో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఎముకలు బలపడతాయని తెలిసింది. రుతుక్రమం ఆగిపోయిన (మెనోపాజ్ వచ్చిన) కొందరు మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో టొమాటో రసం వల్ల ఎముకలు బలపడతాయని నిరూపితమైంది. అయితే తాజా టొమాటో జ్యూస్ వల్లనే ఈ ఫలితం ఉంటుందని, దాన్ని సాస్, కెచప్ రూపంలో నిల్వ ఉంచడం వల్ల లైకోపిన్ తగ్గుతుందని నిరూపితమైంది.

ఈ లైకోపిన్ అన్నది ఎర్ర రంగులో ఉండే క్యారట్, పసుపుపచ్చరంగులో ఉండే బొప్పాయి, పింక్ రంగులో ఉండే ద్రాక్షపళ్లలోనూ ఉంటాయని తెలిసింది. ఇకపై ఎముకల బలానికి టొమాటో జ్యూస్‌నూ ఒక మార్గంగా ట్రై చేయవచ్చు. ఒకవేళ టొమాటోను జ్యూస్‌గా తీసుకోవడం ఇష్టం లేకపోతే... రుచికరంగా ఉండే క్యారట్, బొప్పాయి, ద్రాక్షలనూ ట్రై చేయవచ్చు. కానీ... వాటన్నింటిలో కంటే టొమాటో జ్యూస్‌లో లైకోపిన్ ఎక్కువ అని గుర్తుంచుకోవడం బెటర్.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top