నిద్ర బాగా పట్టాలంటే......కొన్ని చిట్కాలు

  • పొగతాగే అలవాటును పూర్తిగా మానుకోవాలి.
  • బెడ్‌రూమ్ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. మరీ చల్లగానూ, మరీ వేడిగా కాకుండా ఉండాలి. నిద్ర వేళ ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి.
  • సాయుంత్ర వేళలనుంచి కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు.
  • రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయూలి.
  • ప్రతీ రోజూ ఒకే నిర్ణీత వేళకి నిద్రపోవాలి.
  • పగటి పూట కునుకు తీయవచ్చు. ఎక్కువసేపు నిద్రపోకూడదు.
  • నిద్రకు ఉపక్రమించే ముందర టీవీలో ఉద్వేగం కలిగించే దృశ్యాలున్న సినిమాలూ, సీరియుళ్లు చూడకూడదు.
  • రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపయినా పగటి వెలుగులో (డే లైట్) గడపాలి. మసక వెలుగు రూమ్‌లలో గడిపేవారికి రాత్రివేళల్లో సరిగా నిద్రపట్టదు.
  • నిద్రకు ముందు ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినాలి.
  • గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది.
  • నిద్రకు ముందు పుస్తకాలు చదవడం వంటివి చేయకూడదు. పుస్తకం చదువుతూ ఉంటే అలా మనకు తెలికుండానే నిద్రపడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ... నిజానికి దృష్టి పూర్తిగా చదవడంలో నిమగ్నమైపోతే నిద్రకు దూరమయ్యే అవకాశం ఎక్కువ.
  • నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. కొందరిలో ఆల్కహాల్ నిద్ర పట్టడానికి దోహదం చేసినా అది గాఢనిద్ర దశలోకి వెళ్లనివ్వదు. దాంతో నిద్రలేచాక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు. అందుకే మద్యం తాగాక నిద్ర నుంచి మెలకువ వచ్చినా నేచురల్ స్లీప్‌లోలా అలసటంతా తీరిపోయిన రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top