యోగాతో అధిక బరువు తగ్గవచ్చా?

ప్రస్తుతం చాలామంది చేస్తున్న పొరపాటు ఇదే. కేవలం బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ ఒక్కటే క్యాలరీలను కరిగించగలిగితే ఈ ప్రపంచంలో స్థూలకాయులనేవారు ఉండరేమో! కొవ్వు అనేది చిక్కగా ఒకేచోట పేరుకుపోయిన శక్తి. దానిని ఉష్ణశక్తిగా మార్చగలగాలి. అంటే వ్యాయామాల ద్వారానే కొవ్వు కరుగుతుంది. శరీరం కొవ్వును ఏవిధంగా కరిగించగలదో ఆయా ప్రక్రియల గూర్చి ముందుగా తెలుసుకోండి.

ఊపిరితిత్తులు: ఇవి శ్వాసక్రియ ద్వారా ప్రాణవాయువును గ్రహించి శరీరానికంతటికీ సరఫరా చేస్తాయి. శక్తివంతమైన, సమర్థవంతమైన శ్వాసక్రియ... ఊపిరితిత్తులు ప్రకృతి నుంచి కావలసినంత ఆక్సిజన్‌ను గ్రహించేలా చేస్తుంది.


గుండె, రక్తనాళాలు: ఇవి శరీరంలో రవాణా వ్యవస్థలా పనిచేస్తాయి. ఇవి రక్తంలో కరిగిన ఆక్సిజన్‌ను, ఇతర పోషకపదార్థాలను గ్రహించి శరీరమంతటికీ సరఫరా అయ్యేలా చేస్తాయి. శ్వాసక్రియ వేగంగా జరిగితే అంటే వేగంగా గాలి పీల్చి వదలడం ద్వారా రవాణావ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తుంది.


కండరాల కదలికలు: శరీరంలోని ఆక్సిజన్‌ను, పోషకాలను ఉపయోగించుకునేవి ఇవే. శరీర కదలికలు చురుకుగా ఉంటే ఇవి కూడా చురుకుగా, సమర్థవంతంగా పనిచేస్తాయి.

 

వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, క్రాస్ కౌంటింగ్ వంటివి ఏరోబిక్ ఎక్సర్‌సెజైస్ కిందికి వస్తాయి. వంటిలో పేరుకుపోయిన కొవ్వును కరిగించాలంటే మీరు చెప్పినట్లు కేవలం ఊపిరి పీల్చి వదిలితే చాలదు, ఏరోబిక్ ఎక్సర్‌సెజైస్ కూడా చేయవలసిందే! అప్పుడే అధిక బరువు తగ్గించుకోగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top