మీ మెనూ ఇలా ఉంటే......స్థూలకాయంతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలూ రావు .

కీళ్ల నొప్పుల వల్లో, మరేదైనా ఆపరేషన్ కారణంగానో ఇంట్లో పడక మీదే ఎక్కువకాలం గడపాల్సి వచ్చినపుడు లావైపోతున్నామని, వొంట్లో బరువు పెరిగిపోతోందని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. శారీరక వ్యాయామానికి ఆరోగ్య పరిస్థితి సహకరించనపుడు తీసుకునే ఆహారంలోనైనా శ్రద్ధ తీసుకోకతప్పదు. ఖాళీగా ఉన్నామని ఏది పడితే అది తింటే స్థూలకాయంతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలూ తలెత్తే ప్రమాదం ఉంది. ఈ విధంగా కొన్ని ఆహార పద్ధతులు పాటిస్తే కొన్ని సమస్యల నుంచి తప్పించుకోవచ్చని న్యూట్రిషన్ నిపుణులు అంటున్నారు.

మొలకెత్తిన ధాన్యాలను ఉదయం అల్పాహారంగా తీసుకోవడం వల్ల చక్కని పోషకాలు లభిస్తాయి. వాటిలో అవసరమైతే క్యారెట్, కీరా ముక్కలను కలుపుకోండి. రుచికోసం కొద్దిగా నిమ్మరసం పిండుకోండి.

మధ్యాహ్నం లంచ్ కోసం సమతుల్య ఆహారాన్ని తీసుకోండి. తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. చపాతీ, అన్నం, బ్రెడ్, పరోటా వంటి వి ఏవి తీసుకున్నా అందులోకి ఆకుకూరలు, కూరగాయలు, పప్పుదినుసులతో కూడిన వంటకాలను చేర్చుకోవడం మంచిది.


శాకాహారులైతే పాలు, పెరుగు, వెన్న, పప్పులు, తాజా ఆకుకూరలు, అలాగే ఆలు, టమోట, క్యాబెజ్, ముల్లంగి, క్యారెట్, బీన్స్, క్యాలీ ఫ్లవర్ తదితర పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.

మాంసాహారులు చేపలు, చికెన్, కోడిగుడ్లను తీసుకోవచ్చు. అయితే బీఫ్, పోర్క్ వంటి మాంసాహారాన్ని తీసుకోకపోవడమే మంచిది. ఈ మాంస పదార్థాలు అరుగుదల సమస్యను తెచ్చిపెడతాయి.

శాకాహారులైనా, మాంసాహారులైనా తప్పనిసరిగా పండ్లను విరివిగా తీసుకోవాల్సి ఉంటుంది. రోజుకు కనీసం నాలుగైదు రకాల పండ్లనైనా ఆహారంగా స్వీకరించక తప్పదు. కొన్నిటిని జ్యూస్‌ల రూపంలోనైనా తీసుకోవచ్చు.

నూనెలో వేయించిన పదార్ధాలను పూర్తిగా వదిలిపెట్టండి. స్వీట్లు వంటి తీపి పదార్ధాలను పూర్తిగా దూరంపెట్టండి. పాలు, టీలలో చక్కెరకు బదులు తేనె వేసుకోండి.

సాయంత్రం ఆకలేసిపుడు బోండాలు, బజ్జీలు వంటి నూనెలో వేయించిన పదార్థాలు కాక చక్కని పోషకాలు కూడిన బిస్కెట్లు, వేయించిన శనగలు లేదా బటానీలు వంటివి తీసు
కోండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top