డయాబెటిస్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించకండి. ఆ వ్యాధి గురించి తెలుసుకోవడానికి ముందు ప్రయత్నించండి.

డయాబెటిస్ తమకు వచ్చిందని తెలిసిన మరుక్షణం చాలామంది తమ జీవితం ఇక ముగింపు దశకు వచ్చేసిందని నిరాశకు లోనవుతుంటారు. అయితే అది చాలా తప్పుడు అభిప్రాయం. డయాబెటిస్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించకండి. ఆ వ్యాధి గురించి తెలుసుకోవడానికి ముందు ప్రయత్నించండి. డయాబెటిస్ చికిత్సలో 'నిర్మూలన' అన్న పదం లేదు. కేవలం 'నియంత్రణ' మాత్రమే జరుగుతుంది. ఇందుకు చేయాల్సిన ప్రాథమిక సూత్రాలను తెలుసుకుని పాటించండి.

* వ్యాయామం అన్నది దినచర్యలో ఒక భాగం చేసుకోండి. రోజూ ఉదయం వాకింగ్ వెళ్లండి. పరిశుభ్రమైన గాలిని పీల్చండి. 

* రోడ్డుపైన దొరికే చిరుతిళ్లను దూరంపెట్టండి. చక్కటి పోషకాలతో కూడిన ఆహారాన్ని మితంగా విరామమిస్తూ ఎక్కువ సార్లు తీసుకోండి.
*రోజుకు కనీసం ఆరు గంటల నిద్ర తప్పనిసరి. నిద్రపోయే ముందు టివి చూడకండి. దానికి బదులుగా మంచి పుస్తకాన్ని చదవండి.
* సిగరెట్, గుట్కా వంటి పొగాకు పదార్థాలు అలవాటుంటే వెంటనే మానెయ్యండి. మద్యాన్ని కూడా దూరంపెట్టండి.
* చికాకుగా ఉంటే యోగా చేయండి. లేదా మంచి పాటలు వినండి.
 * దంతాల విషయంలో శ్రద్ధ తీసుకోండి. రెగ్యులర్‌గా వైద్యుని సంప్రదించండి.
వీటిని పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు తీసుకుంటే డయాబెటిస్‌ను అదుపు చేయడం కష్టమేమీ కాదని వైద్యులు అంటున్నారు. 'డయాబెటిస్‌ను కంట్రోల్లో పెట్టు. నువ్వు దాని కంట్రోల్‌లోకి వెళ్లకు' అన్న సూత్రాన్ని పాటిస్తే చాలు ఈ వ్యాధి పూర్తిగా అదుపులో ఉన్నట్లే!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top