మెదడు సమస్యలకు బ్రెయిన్ ఓపెన్ సర్జరీ కాకుండా ఇండో వాస్కులర్ న్యూరో సర్జరీ

ఆధునిక జీవనశైలి కారణంగా మెదడు సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్నాయి. మెదడులో రక్తనాళాలు బ్లాక్ అవటం, చిట్లిపోయి బ్రెయిన్ స్ట్రోక్‌తోపాటు బ్రెయిన్ హెమోరైజ్‌లు వచ్చిపడుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి బ్రెయిన్ ఓపెన్ సర్జరీ కాకుండా ఇండో వాస్కులర్ న్యూరో సర్జరీ అందుబాటులోకి వచ్చింది. ఈ సర్జరీతో అనేక లాభాలున్నాయంటున్నారు న్యూరో సర్జన్ డాక్టర్ రణధీర్ కుమార్. గుండె నుంచి మెడ భాగం నుంచి మెదడుకు నాలుగు నాళాలు రక్తాన్ని సరఫరా చేస్తాయి. సున్నితమైన ఈ రక్తనాళాల్లో రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడినా, మెదడులో ఉన్న రక్తనాళాలు చిట్లినా బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ హెమోరేజ్ రావచ్చు. మెదడులో ఏర్పడే ఈ సమస్యలు హృద్రోగాల కంటే ప్రమాదమైనవి. గతంలో మెదడు సంబంధ సమస్యలతో 90 శాతం మంది రోగులు మరణించే వారు. కాని అభివృద్ధి చెందిన ఆధునిక వైద్యంతో కోలుకుంటున్న రోగుల సంఖ్య పెరిగింది.

ఎందుకు వస్తాయి?

అధిక రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంచుకోకపోవటం, ధూమపానం, అధికంగా మద్యం సేవించటం, స్థూలకాయం, కొవ్వు ఉన్న ఆహారపదార్థాలు ఎక్కువగా తినటం, వంశపారంపర్యంగా కుటుంబంలో ఎవరికైనా మెదడు సంబంధ జబ్బులు ఉండటం లాంటి కారణాలతో మెదడులో రక్తనాళాలు బ్లాక్అవటం, చిట్లిపోవటం జరుగుతుంది.

కళ్లు బైర్లుకమ్మితే ...
మెదడులోని రక్తనాళాల్లో ఆటంకం ఏర్పడినపుడు రోగికి అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అధిక తలనొప్పి, వాంతులవటం, ఒకవైపు కాళ్లు, చేతులు పనిచేయక పోవటం, ఫిట్స్ రావటం జరుగుతుంది. మాట్లాడుతుండగానే, లేదా బాత్రూంకు వెళ్లి వచ్చేలోగా ఆకస్మాత్తుగా వచ్చే ఈ బ్రెయిన్ స్ట్రోక్‌తో రోగి కోమాలోకి కూడా వెళ్లే అవకాశముంది. మెదడులోని రక్తనాళాలు చిట్లినపుడు తీవ్ర తలనొప్పితోపాటు ముఖంలో మార్పులు సంభవిస్తాయి. కళ్లు తిరగటం, ఆకస్మాత్తుగా బ్లరింగ్ విజన్ రావటం, మాట్లాడలేక పోవటం, ఏ వైపు రక్తనాళాలు చిట్లితే ఆ వైపు కాలు, చేయి పడిపోవటం జరుగుతుంది. ఒక్కోసారి కొందరికి మెదడులో మైనర్‌స్ట్రోక్ వచ్చి 30 నిమిషాల తర్వాత తగ్గుతుంది. మెదడు రక్తనాళంలో చిన్న ఆటంకం ఏర్పడినపుడు ఇలా మైనర్‌స్ట్రోక్ వస్తుంది.

సత్వర చికిత్స

మెదడు సంబంధ సమస్యలు ఏర్పడినపుడు రోగిని 8 గంటల్లోగా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలి. మెదడులో ట్యూమర్ ఏర్పడినపుడే దాన్ని తొలగించేందుకు ఓపెన్ బ్రెయిన్ సర్జరీలు చేస్తున్నారు. మెదడు రక్తనాళాల్లో ఆటంకమేర్పడినా, బెలూన్‌లా ఉబ్బినా, రక్తనాళాలు చిట్లినా ఇండోవాస్కులర్ న్యూరో సర్జరీ విధానంలో చికిత్స చేస్తున్నారు. దాన్నే మినిమల్ ఇన్‌వెజిల్ సర్జరీ అంటారు.ఈ అధునాతన సర్జరీల వల్ల మెదడు సంబంధ వ్యాధి వచ్చినా, సత్వరం కోలుకుంటున్న రోగుల సంఖ్య పెరిగింది.

కెరటిడ్ యాంజియో ప్లాస్టి : 

గుండెకు చేసే యాంజియో ప్లాస్టీ లాగా మెదడులోని రక్తనాళాల్లోని ఆటంకాలను తొలగిస్తారు. మెదడులోని రక్తనాళంలో 80 శాతానికి పైగా బ్లాక్ అయినపుడు, మెదడుకు రక్తసరఫరా తగ్గుతుంది. ఇలాంటపుడు కాలి రక్తనాళం నుంచి రంధ్రం చేసి దాని ద్వారా బెలూన్ సాయంతో స్టంట్ వేస్తారు.

ఇండో వాస్కులర్ అక్యూట్ థ్రంబోలైసిస్ :

మెదడులోని రక్తనాళంలో రక్తం గడ్డ కట్టినపుడు ఈ విధానంలో టిస్యూ ప్లాజ్మినోజెన్ యాక్టివేటర్ (టీపీఏ) అనే మందును కాలి రక్తనాళం ద్వారా మెదడులోని నాళానికి పంపించి రక్తం గడ్డను కరిగిస్తారు. మెదడు రక్తనాళాల్లో బెలూన్‌లు ఏర్పడినపుడు రక్తనాళాలు చిట్లుతాయి. ఇలాంటి సమయంలో అనుర్‌యైసీన్ బెలూన్‌ల ద్వాఆర కెథటిడ్ అనే మందును పంపించి ప్లాటినం కాయల్ ను రక్తనాళం బెలూన్‌లో ఫిల్లింగ్ చేస్తారు.

యాట్రియో వెనస్‌మాల్ ఫార్మేషన్స్ :

పుట్టుకతో జెనిటిక్ ద్వారా చిన్న పిల్లలకు వస్తున్న ఈ మెదడు సంబంధ వ్యాధికి ఇండో వాస్కులర్ విధానంలో చికిత్స చేస్తారు. సాధారణంగా పది నుంచి పదిహేనేళ్ల పిల్లల్లో వస్తున్న ఈ సమస్యకు ఇండో వాస్కులర్ విధానంలో స్పెషల్ గ్లూక్ ద్వారా ఓనెస్క్ అనే మందును మెదడు రక్తనాళంలోకి పంపించి చికిత్స చేస్తారు.

పాలీవీనమ్ ఆల్కహాల్ పాటికల్ (పీవీఏ) : 
బ్రెయిన్ ట్యూమర్లకు శస్త్రచికిత్స చేసేటపుడు రక్తం బ్లీడింగ్‌ను నివారించటానికి సరికొత్త మందు అందుబాటులోకి వచ్చింది. మెదడులో ఏర్పడే చాలా రకాల ట్యూమర్లను తొలగించటానికి శస్త్రచికిత్స అవసరం. శస్త్రచికిత్సకు ముందు పాలీవీనమ్ ఆల్కహాల్ పాటికల్ అనే మందును ట్యూమర్‌లోకి పంపించగానే బ్లీడింగ్‌ను నివారిస్తుంది. ఈ విధానంలో ట్యూమర్‌ను తొలగిస్తున్నపుడు బ్లీడింగ్ కాకుండా నివారించవచ్చు.
ఇండో వాస్కులర్‌తో ఉపయోగాలెన్నో...
మెదడు సంబంధ సమస్యలకు బ్రెయిన్ ఓపెన్ సర్జరీ కాకుండా ఇండో వాస్కులర్ న్యూరో సర్జరీ చేయటం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ప్రాణాపాయం లేకుండా సత్వర వైద్యం లభిస్తుంది. రోగి రెండో రోజే ఆసుపత్రి నుంచి డిశ్జార్జి కావచ్చు. వెంటిలేటర్‌పై, ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండే అవసరం ఉండదు.
 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top