సాధారణంగా వృద్ధాప్యంలో పీడించే సమస్యలలో ప్రధానమైనది కీళ్ల సమస్య.హోమియోలో కీళ్ల నొప్పులకు మేలైన మందులు

పూర్వం వయసు మీద పడ్డాక వచ్చే కీళ్ల నొప్పులు ఇప్పుడు నడి వయసు రాక ముందు నుంచే బాధిస్తున్నాయి. జీవనశైలి, ఆహారపు ఆలవాట్లలో మార్పు రావడం, స్థూలకాయం ఈ సమస్య ఎక్కువ మందిలో కనిపించటానికి ప్రధాన కారణాలు.

సాధారణంగా వృద్ధాప్యంలో పీడించే సమస్యలలో ప్రధానమైనది కీళ్ల సమస్య. కీళ్ల నొప్పులకు ముఖ్యకారణం ఆర్థరైటిస్. ఈ సమస్యలో ఎముకలు అరిగి కీళ్ల నొప్పి రావచ్చు. సాధారణంగా ఈ సమస్య మోకాళ్లు, భుజాలు, మడమలు, మణికట్టు వంటి ప్రదేశాలలో వచ్చే అవకాశం ఉంది. కాని ఐదు కంటే ఎక్కువ కీళ్లకు ఈ సమస్య వస్తే దానినే పాలీ ఆర్థరైటిస్ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్, సొరియాటిక్ ఆర్థరైటిస్, సిస్టమిక్ ల్యాప్స్ ఎరిమేటస్, పోలీమయాల్జియా రుమాటికా, ఇన్‌ఫెక్షన్స్, క్యాన్సర్, అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటిస్ కారణంగా ఆర్థరైటిస్ సమస్య ఏర్పడే అవకాశం ఉంది.

వ్యాధి లక్షణాలు
నొప్పి, వాపు, సమస్య ఉన్న ప్రదేశం ఎర్రగా కందిపోవడం, వాపు వద్ద వేడిగా ఉండడం, కదలికలు కష్టంగా ఉండడం, ఎముకలు వంకర్లు పోవడం, కీళ్లు పట్టినట్లు ఉండటం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఆర్థరైటిస్ వ్యాధి నిర్ధారించేందుకు ఆర్ఎ ఫ్యాక్టర్, ఎఎస్ఓ టైటర్, జాయింట్ల ఎక్సరే, సిబిపి, ఇఎస్ఆర్, ఎఫ్‌బిఎస్, ఆర్‌బిఎస్, పిఎల్‌బిఎస్, ఎఎన్ఎతోపాటు సీరమ్ కాల్షియం పరీక్షలు నిర్వహించాల్సిఉంటుంది. కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడేవారు ముఖ్యంగా బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. ఫిజియోథెరపీ చేయించుకోవడం ద్వారా నొప్పి నుంచి కొంత ఉపశమన లభిస్తుంది. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి.
హోమియో చికిత్స

హోమియో వైద్య విధానంలో రోగి లక్షణాలను బట్టి, రోగి వ్యక్తిత్వాన్ని బట్టి తగిన చికిత్స చేస్తారు. ఈ సమస్యకు హోమియోలో వాడదగిన మందులు బ్రయోనియా, కాల్చికమ్, లెడమ్ పాల్, రస్టాక్స్, లైకో, మెర్క్ సాల్, ఫెర్రమ్ ఫాస్, కాల్కేరియా ఫాస్. బ్రయోనియా: సన్నగా, దృఢముగా, నల్లగా ఉండి, తొందరగా చిరాకు పడేవారికి ఇది మంచి మందు. ఎప్పుడూ తాము చేసే వృత్తి గురించే మాట్లాడుతుంటారు. ఎప్పుడూ ఇంటికి వెళ్లాలనుకుంటారు. శరీరంలో ఉండే మ్యూకస్ మెంబ్రేన్స్ అన్నీ పొడిగా ఉంటాయి. కీళ్లు పట్టినట్లు ఉండి నొప్పి కలుగచేస్తాయి. కీళ్ల వాపు, ఎరుపుదనం, వేడి మొదలైన లక్షణాలుంటాయి. నొప్పులు సూదులతో గుచ్చినట్లు, కదిలితే బాధ అధికమవడం, విశ్రాంతి తీసుకుంటే కొద్దిగా నొప్పులు తగ్గడం వంటివి లక్షణాలు. వీరికి దాహం ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం, వేడిని భరించలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.

కాల్చికమ్: ఇది వాత రోగం ఉన్న వారికి మంచి మందు. ఇది ఎముకల చుట్టూ ఉండే పొర, కీళ్లు, కండరాలు మొదలైన వాటిమీద ప్రభావం చూపుతుంది. నీరసం, శరీరం లోపల చల్లగా ఉండడం, కీళ్ల వాపు, నొప్పి, కీళ్లు పట్టినట్లు ఉండడం, తిమ్మిర్లు, నొప్పి ఒక కీలు నుంచి ఇంకొక కీలుకు మారుతుండటం, స్పర్శకి నొప్పి అధికమవడం, కాళ్లు, చేతులు చల్లబడిపోవడం మొదలైన లక్షణాలు ఉంటాయి.
 

రస్టాక్స్: ఒక చోట కుదురుగా కూర్చోలేరు. ఉత్సాహంగా ఉండరు. ఆత్మహత్య గురించి ఆలోచనలు రావడం, రాత్రి పూట భయం, గుండెదడ, అధిక శ్రమ, బరువులు మోయడం వల్ల వచ్చిన సమస్యలు, కీళ్ల నొప్పులు, వాపు, చేతులు-కాళ్లు పట్టినట్లు ఉండి నొప్పి, చల్లగాలి భరించలేరు, తిమ్మిర్లు, సీయాటికా వంటి లక్షణాలు ఉంటాయి. లైకోపోడియమ్: దిగులు, ఒంటరిగా ఉండాలంటే భయం, కొత్త పనులు చేయడానికి ఇష్టపడరు. ఆత్మవిశ్వాసం కోల్పోవడం, మతిమరుపు, తీపి పదార్థాలను ఎక్కువగా ఇష్టపడడం, కీళ్ల నొప్పి, వాపు, వాత రోగం, కాళ్లు-చేతులు బరువుగా ఉండడం, కీళ్ల దగ్గర చిరిగినట్లు నొప్పి, పాదాల నొప్పి, కాలి వేళ్లు, పిక్కలు రాత్రివేళ కొంకర్లు పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. సమస్య వేడి వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది.

మెర్క్ సాల్: అధిక వేడిని లేదా చల్లదనాన్ని భరించలేరు. జవాబు త్వరగా ఇవ్వరు. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. తమకు ఏదో దూరమవుతోందని భావిస్తారు. కాళ్లు, చేతులు వణకడం, కీళ్లనొప్పి, రాత్రి వేళ సమస్య ఎక్కువగా ఉండటం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉంటాయి. వీరికి ఈ మందు చక్కగా పనిచేస్తుంది. ఫెర్రమ్ ఫాస్: సున్నితంగా ఉండి భయం, రక్తహీనత కలిగి ఉన్న వారికి ఇది మంచి మందు. జ్వరాలకు, వాపులకు ఇది బాగా పనిచేస్తుంది. మెడ నొప్పి, కీళ్ల నొప్పులు, భుజం నొప్పి, కీళ్ల వాపు, మొదలైన లక్షణాలు ఉంటాయి. మాంసం, పాలు ఇష్టపడరు. ఆహారం తీసుకున్న వెంటనే వాంతులు, ముక్కు నుంచి రక్తం కారడం వంటి సమస్యలు ఉంటాయి. రాత్రి వేళలు, కుడి వైపు కదలికలకు, స్పర్శకు నొప్పి ఎక్కువగా ఉండడం వ్యాధి లక్షణాలు.

కాల్కేరియా ఫాస్: సన్నగా ఉండి, జీర్ణశక్తి సరిగ్గా లేని, రక్తహీనత కలిగి, చల్లదనం తట్టుకోలేనివారికి ఇది మంచి మందు. అధిక బాధ తర్వాత వచ్చే సమస్యలు, ఎప్పుడూ ఎక్కడికో వెళ్లాలనుకోవడం, కీళ్ల నొప్పి, పట్టినట్లు ఉండటం, చల్లగా ఉండి తిమ్మిర్లు రావడం, మెట్లు ఎక్కడానికి కష్టంగా ఉండటం వంటివి లక్షణాలు. తేమ, చల్లని వాతావరణంలో సమస్య ఎక్కువగా ఉంటుంది. వేడి వాతావరణంలో కొంత ఉపశమనం ఉంటుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top