టెన్షన్ నుంచి బయటపడేందుకు మనిషి శరీరానికి సర్వీసింగ్ మసాజ్

మనం నిత్యం స్కూటర్‌లోనో, కారులోనో తిరుగుతుంటాం. నెలకో రెండునెల్లకోసారి మన బండిని మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లి దానికి సర్వీసింగ్ చేయిస్తుంటాం. క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించకపోతే బండి మూలనపడుతుంది. అలాగే మనిషి శరీరానికి సర్వీసింగ్ తప్పనిసరి. పాతకాలంలో వారానికోసారి ఒళ్లంతా నూనె పట్టించి ఎండలో ఓ గంటసేపు ఒంటిని ఆరబెట్టుకుని స్నానం చేసిన రోజులు పాతతరం వారికి గుర్తుండే ఉంటాయి. అయితే కాలంతో పరుగులు పెట్టే రోజులు ఇవి. ఈ యాంత్రిక జీవనంలో మనిషికి తీరిక దొరకడమే దుర్లభమైపోయింది.

టెన్షన్ నుంచి బయటపడేందుకు నగర జీవి మసాజ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నాడు. శారీరకంగా మానసికంగా అలసిపోయినపుడు మసాజ్ చేయించుకుంటే ఒళ్లు తేలిక కావడమే కాక మానసికంగా కూడా ఉల్లాసం చేకూరుతుంది. మసాజ్‌లో ఉపయోగించే వివిధ నూనెలు శరీరంలోని కండరాలను సాగదీస్తాయి. శరీరంలో రక్తప్రసరణ సంపూర్ణంగా జరిగి శరీరంలోని అన్ని భాగాలకు పోషకాలు, ఆక్సిజన్ లభిస్తుంది.



చైనీయులు మసాజ్‌లో ఆక్యుప్రెషర్ చికిత్స విధానాన్ని ఉపయోగిస్తున్నారు. వెన్నుపూస నుంచి అన్ని శరీర భాగాలకు వెళ్లే నరాలకు ఎటువంటి అంతరాయం లేకుండా రక్త ప్రసరణ జరిగేలా ఈ చికిత్సా విధానం ఉంటుంది. ఆక్యుపంక్చర్ పద్ధతిలో కూడ నరాల వ్యవస్థ ఆధారంగా వైద్యం జరుగుతుంది. శరీరంలో వృథాగా ఉండే కొన్ని ఆమ్లాలను బయటకు పంపించడానికి కూడా మసాజ్ ఉపయోగపడుతుందని తేలింది.

మసాజ్ చేసుకున్న తర్వాత బడలికంతా పోయి శరీరం తేలికగా మారడానికి అనవసర వ్యర్థాలు కరిగి బయటకు పోవడమూ కారణమని జర్మనీ శాస్త్రవేత్తలు నిరూపించారు. ఏదేమైనా వాహనాలకైనా వారెంటీ ఉంటుంది కాని మనిషి శరీర భాగాలకు ఎటువంటి గ్యారెంటీ లేదని గుర్తిస్తే మనం కూడా అప్పుడప్పుడు సర్వీసింగ్ చేయించుకోవడంపై శ్రద్ధ వహిస్తామేమో!

* మసాజ్ చేయించుకునేముందు అక్కడ పరిసరాలను జాగ్రత్తగా గమనించండి. దుస్తులు మార్చుకోవలసి వస్తే స్పై కెమెరాలు వంటివి ఉన్నాయేమో గమనించండి.
* మీ శరీరంలోని ఏ భాగాన్ని స్ట్రెస్ నుంచి రిలాక్స్ చేయదలచుకున్నారో స్పష్టంగా మసాజ్ థెరపిస్ట్‌కు ముందే తెలియచేయండి.
* మీకు దీర్ఘకాలంగా బాధపెడుతున్న రుగ్మతలు కాని, గుండె సంబంధ వ్యాధులు కాని ఉంటే డాక్టర్ల సలహా మేరకే మసాజ్ చేయించుకోండి.
* మసాజ్ జరుగుతున్న సమయంలో సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. కళ్లు మూసుకుని చక్కగా సంగీతాన్ని ఆస్వాదించండి. ఉబుసుపోక మాటలతో సమయాన్ని వృథా చేయకండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top