మడమ నొప్పికి మేలైన చికిత్స - ఎక్సర్సైజ్ లు - హోమియో మందులు

వయసు పెరుగుతున్న కొద్ది, అరికాలిలో ఉండే ప్లాంటార్ ఫెషియ సాగే గుణాన్ని కోల్పోయి, గట్టిగా మారుతుంది. మడమలో ఉండే ఫ్యాట్ పాడ్ ఇది షాక్ అబ్సార్బర్‌గా పనిచేస్తుంది. ఇది సన్నగా మారడం వలన గాయాలను తట్టుకునే శక్తిని కోల్పోతుంది. షాక్ వలన ప్లాంటార్ ఫెషియ డామేజ్ అవుతుంది.

దీని వల్ల వాపు, నొప్పి వస్తుంది. దీంతో పాటు మడమ నొప్పి, వాపు కలిగి ఉంటుంది. ఊబకాయం, బరువు ఎక్కువగా ఉండటం, మధుమేహం, ఎక్కువ సమయం నిలబడటం, పనిచేయడం, అధిక శ్రమ వల్ల ప్లాంటార్ ఫెసియైటిక్ సమస్య అధికం అవుతుంది.

 
నిర్ధారణ ఎలా?
వైద్యుడు ముందుగా మీ నొప్పి గురించి అడిగి తెలుసుకుంటారు. నొప్పి ఏ విధంగా ఉంది?, ఎప్పుడు వస్తుంది, ఎన్ని రోజుల నుంచి మీరు ఈ నొప్పితో బాధపడుతున్నారు? అనే విషయాల్ని తెలుసుకుంటారు. ఉదయం పూట మీరు మొట్టమొదటగా నిలుచున్నపుడు మీ మడమలో నొప్పి కలిగిన దానిని ప్లాంటార్ ఫైసియైటిస్ అంటారు. చాలామందికి పొడిచినట్లుగా లేదా సూదితో గుచ్చినట్లుగా నొప్పి ఉంటుంది.ఈ నొప్పి అరికాలు కిందిభాగంలో ఉంటుంది. ఎక్కువ సేపు నిలబడడం వల్ల నొప్పి అంత తీవ్రంగా ఉండదు. చాలా సేపు కూర్చొని తిరిగి నిల్చోవడం వల్ల ఈ నొప్పి తీవ్రంగా ఉంటుంది.

విముక్తి ఎలా?
ఎక్కువ సమయం నడిచినా, లేదా పరిగెత్తినా నొప్పి ఎక్కువగా ఉంటుంది. దీనిని తగ్గించండి పాదము పెద్దదిగా ఉన్నా లేదా ముందు భాగము పెద్దదిగా ఉన్నా వైద్యులను సంప్రదించి, మీ పాదమునకు తగిన షూస్‌ను ధరించండి. వీటిని ఆర్థోటిక్స్ అంటారు. ఇవి పాదమునకు సపోర్ట్‌గా పనిచేస్తాయి. ఎక్కువ బరువును కలిగి ఉన్నా ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది.

బరువు తగ్గించుకుంటే ఈ నొప్పిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఎక్కువ సమయం ఒకే చోట నిలబడి పనిచేసిన లేదా గట్టిగా ఉండే నేలపైన ఎక్కువ సమయం పని చేయవలిసి వచ్చినా, ఆ నేలపైన పాడింగ్‌ను ఉంచి పని చేయండి అప్పుడు మడమనొప్పి సమస్య అదుపులో ఉంటుంది.


ఎక్సర్‌సైజ్‌లు మేలు
ఈ సమస్య పరిష్కారానికి స్ట్రెచింగ్ ఎక్సర్ సైజ్ చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రోజుకి రెండు సార్లు చేయండి.


ప్లాంటార్ ఫెషియ స్ట్రెచ్:
ఈ ఎక్సర్‌సైజ్‌లో నిటారుగా నిలబడి గోడను రెండు చేతులతో పట్టుకొని, గోడకు ఎదురుగా గాయమైన కాలును, మాములుగా ఉన్న కాలికి కొంచెం వెనుకగా పెట్టండి. మడమ భాగమును, నేలకు సరిసమానముగా పెట్టండి. నెమ్మదిగా రెండు కాళ్ళ మోకాళ్ళను వంచండి. ఇలా చేయడం వలన కాలి కింది భాగములో స్ట్రెచ్ అవుతుంది. ఈ స్ట్రెచ్‌ను 10 నుంచి 15 నిమషాల వరకు ఇలానే ఉంచండి. ఇలా ఈ ఎక్సర్‌సైజ్‌ను 6 నుంచి 8 సార్లు చేయండి

కాఫ్ స్ట్రెచ్: 

ఈ ఎక్సర్‌సైజ్‌లో గోడకు ఎదురుగా నిటారుగా నిలబడి , రెండు చేతులతో గోడను పట్టుకొని ( తోస్తూ) గాయమైన కాలిని మాములుగా ఉన్న కాలికి కొంచెం వెనుకగా పెట్టండి. మడమ భాగమును నేలకు సరిసమానంగా పెట్టండి. గాయమైన కాలును స్ట్రెట్‌గా ఉంచండి. మామూలుగా ఉన్న కాలు మోకాళ్ళను వంచండి. ఇలా చేయడం వలన కాలు మధ్యభాగంలో ఉన్న పిక్క కండరాలు స్ట్రెచ్ అవుతాయి. ఈ స్ట్రెచ్‌ను 10 నుంచి 15 నిమషాల వరకు ఇలానే ఉంచండి. ఈ ఎక్సర్‌సైజ్‌ను 6 నుంచి 8 సార్లు చేయండి ఈ రెండు ఎక్సర్‌సైజులే కాక ఇతర ఎక్సర్‌సైజులు కూడా చేయవచ్చును.

కాలులో ఉన్న కండరాల బలానికి పాదము మీద నిల్చొని , నెమ్మదిగా కాలు చివరి భాగమును పైకి లేపి బొటనవేళ్ళ పైన నిల్చోండి. కాసేపు ఇలానే ఉంచి, తిరిగి నెమ్మదిగా పాదమును కిందకి పెట్టండి. ఈ వ్యాయామాలు చేసినా కొన్ని సందర్భాల్లో నొప్పి తగ్గదు. ఎక్సర్‌సైజులు, ఆర్చ్ సపోర్ట్స్, మెడిసిన్స్, ఇవి ఉపయోగకరంగా లేనపుడు వైద్యులను సంప్రదించి ఇతర చికిత్సలు తీసుకోవాలి. రాత్రివేళల్లో పాదములో స్ప్లింట్స్‌ను ధరించవలసి ఉంటుంది. కార్టికో స్టిరాయిడ్స్ ఇంజెక్షన్స్ ప్లాంటార్ ఫేషియాను తీసుకోవలసి ఉంటుంది. కొన్ని కేసులలో శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుంది.

హోమియోలో చికిత్స
రూట, అమోనియం.మూర్, కాల్కేరియఫ్లోర్, రస్టాక్స్, లెడమ్‌పాల్, రొడొటెండ్రాన్, పల్సటెల్లా మందులు మడమ నొప్పికి బాగా పనిచేస్తాయి.

రూట :

సయాటికా, నొప్పి నడుము భాగము నుంచి, తుంటి భాగము, కాళ్ళు, మడమ వరకు ఉంటుంది. పడుకున్నప్పుడు , రాత్రిళ్ళల్లో అధికం. టెండాన్‌లలో నొప్పి, ఎముకలలో నొప్పి, కీళ్ళలో నొప్పులు, మెడ భాగములో నొప్పులు, ఉదయం పూట సమస్యలు అధికం. కాళ్ళు, చేతులు పట్టేసినట్లుండుట. కండరాలలో నొప్పి, ఆందోళన, స్ప్రెయిన్స్, దెబ్బల వలన నొప్పులు, మూత్రం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళాలనిపించడం. ఈ సమస్యలకు రూటా చక్కగా పనిచేస్తుంది.

రస్టాక్స్ :
కండరాలు, లిగమెంట్స్, కనెక్టివ్‌టిష్యూ డిసార్టర్స్‌కు మంచి మందు. వీటి వాపు వలన కలిగే కండరాల బాధలు, సంకోచ వ్యాకోచ లోపాలు, బెణుకులు, ఆటలు ఆడే వారిలో శారీరక శ్రమ ఎక్కువ చేసేవారిలో, ఎక్కువగా పరిగెత్తే వారిలో వచ్చే నొప్పులకు వాడదగినది. ఆందోళన, ఒక ప్రదేశంలో ఉండలేరు. కాళ్ళు పట్టేసినట్లుండుట, మడమనొప్పి, వాపు , సయాటికా విశ్రాంతి వల్ల, రాత్రిళ్ళల్లో సమస్యలు అధికం. వేడి వాతావరణంలో చలనం వలన ఉపశమనం, భయము, తరుచూ ఏడ్చే స్వభావం ఉన్న వారికి ఈ మందు మేలు చేస్తుంది.

అమ్మోనియం మూర్:

మడమలో పొడిచినట్లుగా ఉండే నొప్పి, వాపు, సయాటికా,కూర్చున్న సమస్యలు అధికం, పడుకున్నపుడు ఉపశమనం. కాళ్ళల్లో నొప్పులు, చేతులలో, వేళ్ళల్లో నొప్పి. పాదమలో చెమటలు భరించలేని వానసను కలిగి ఉండుట, కీళ్ళలో నొప్పులు, కండరాల నొప్పులు, మలబద్దకం, చలిని భరించలేరు. ముఖ్యంగా ఇది ఊబకాయం ఉండేవారిలో, ఇవ్వదగినది.బాధ, చిరాకు,కోప స్వభావం గల వారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top