రాజ్ కమల్ కాజు


కావలసినవి:
జీడిపప్పు - 300 గ్రా
చక్కెర - 220 గ్రా, పిస్తా - 50 గ్రా
పింక్ కలర్ - చిటికెడు (అన్నింటినీ కలిపి పేస్ట్ చేయాలి)
పిస్తా- 50 గ్రా (విడిగా పేస్ట్ చేయాలి)
చక్కెర - 30 గ్రా, జీడిపప్పు - 50 గ్రా
కుంకుమపువ్వు - అరగ్రాము (అన్నింటినీ పేస్ట్ చేయాలి)

తయారి:

జీడిపప్పు, చక్కెర, పిస్తా, పింక్ కలర్ మిశ్రమాన్ని సన్న మంట మీద దగ్గరగా వచ్చే వరకు ఉడికించాలి. అదే విధంగా పిస్తా పేస్ట్‌ను దగ్గరగా వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత జీడిపప్పు, కుంకుమ పువ్వు, చక్కెర పేస్ట్‌ను ఉడికించి పక్కన ఉంచాలి (ఇది పసుపు రంగులో ఉంటుంది). ఇప్పుడు ముందుగా కొద్దిగా పింక్ కలర్ మిశ్రమం, పిస్తా పేస్ట్, తర్వాత కుంకుమపువ్వు మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని అన్నింటినీ కలిపి లడ్డూలుగా కానీ ఫొటోలో కనిపిస్తున్న ఆకారంలో కానీ చేసుకోవాలి. అంతే రాజ్‌కమల్ కాజు రెడీ. ఇందులో లడ్డూలు కట్టడంలోనే నైపుణ్యం ఉంటుంది. లేయర్స్ కలిసిపోకుండా జాగ్రత్తగా చేయాలి. ఈ స్వీట్‌లను ఫొటోలో ఉన్నట్లు కట్ చేస్తే ఆకర్షణీయంగా కనిపిస్తాయి.



నోట్:
మిశ్రమాన్ని ఎంత సేపు ఉడికించాలంటే... చేతికి నెయ్యిరాసి కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని బాల్‌లాగ చేస్తే చేతికి అతుక్కోకుండా రావాలి. అతుక్కుంటోంది అంటే మరికొంత సేపు ఉడికించాలని అర్థం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top