జంతికలు

కావల్సినవి:  
మినప్పప్పు, పెసరపప్పు - రెండు గ్లాసుల చొప్పున, బియ్యం - అరగ్లాసు, కారం, వాము - రెండు చెంచాలు, ఉప్పు - రుచికి తగినంత, వెన్న - పావుకప్పు, నూనె - వేయించడానికి సరిపడా.
తయారీ:
పొయ్యి మీద బాణలి పెట్టి నూనె లేకుండా మినప్పప్పు, పెసరపప్పు, బియ్యం ఒకదాని తరవాత ఒకటి వేయించుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారాక పిండి పట్టించాలి. ఇప్పుడు నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ చేర్చి జంతికల పిండిలా కలపాలి. అవసరమైతే కొద్దిగా నూనె కలపాలి.  
బాణలిలో నూనె వేడి చేసి ఈ పిండిని జంతికల గొట్టంలో తీసుకుని జంతికల్లా వేసుకోవాలి. వేగాక తీసేస్తే కరకరలాడే మినప్పప్పు జంతికలు సిద్ధం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top