గొంతునొప్పి (త్రోట్ పెయిన్) - హోమియో వైద్యం

ఈ సీజన్‌లో చాలామంది గొంతునొప్పితో బాధ పడుతుంటారు. గొంతులో ఇనెఫక్షన్ కారక సూక్ష్మక్రిములు ఏర్పడం వలన గొంతునొప్పి (త్రోట్ పెయిన్) మొదలవుతుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమ, గాలి సరిపడకపోవడంవల్ల ఉపన్యాసాలు ఎక్కువగా ఇవ్వడం, విరామం లేకుండా పాటలు పాడటం వలన కొందరిలో గొంతునొప్పి వచ్చి వేధిస్తుంది. టాన్సిలైటీస్, ఎడినాయిడ్స్, లెరింజైటీస్, ఫెరింజైటీస్ వంటి వ్యాధుల వలన కూడా గొంతునొప్పి వస్తుంది.

లక్షణాలు:
ఆహారం మింగటం, నీరు త్రాగటం, గాలి పీల్చటం, బాగా మాట్లాడటం కష్టంగా మారుతుంది. నోరు బొంగురు పోవడం, గొంతు తడారిపోవడం, నోరు దుర్వాసన వస్తుంది. గొంతు నొప్పి, చెవినొప్పి జలబుతో జ్వరం రావటం, నీరసం, చికాకు వంటి లక్షణాలుంటాయ.

జాగ్రత్తలు: 
చల్లటి గాలిలో తిరుగకూడదు. కలుషిత నీటిని త్రాగకుండా కాచి వడపోసిన నీటిని తీసుకోవటం వలన వ్యాధి తీవ్రత పెరగకుండా ఉంచవచ్చు. చల్లటి పానీయాలను, ఐస్‌క్రీమ్‌లను, బేకరీ ఫుడ్స్ తీసుకోకూడదు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చన్నీళ్ళ స్నానం చేయకూడదు. వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి.

చికిత్స:
హోమియో వైద్యంలో గొంతునొప్పికి మంచి చికిత్స ఉంది. వ్యాధి లక్షణాలను మరియు వ్యక్తి మానసిక, శరీరక లక్షణాలను, పరిగణనలోకి తీసుకొని మందులను ఎన్నుకొని వైద్యం చేసిన గొంతునొప్పి నుండి విముక్తి పొందే అవకాశం ఉంటుంది.
మందులు:
బెల్లడోనా:
గొంతునొప్పి, జ్వరం అకస్మాత్తుగా మొదలుగును. గొంతు నొప్పి కుడివైపు ఎక్కువగా ఉంటుంది. గొంతు పొడారిపోయి మింగటం కష్టంగా మారును. గొంతుకలో ఎర్రబారి ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ప్రయోజనకారి.
ఎకోనైట్:
చల్లగాలిలో తిరగడం వలన గొంతు నొప్పి వెంటనే ప్రారంభమవుతుంది. ఇలాంటి కారణంచే గొంతునొప్పి ప్రారంభమయి, మింగటం కష్టంగా మారి, గొంతు మంట మండుతుంది. దాహం విపరీతంగా ఉండి జ్వరంతో బాధ పడుతుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ఆలోచించదగినది.
హెపార్‌సల్ఫ్:
గొంతునొప్పి చల్లగాలి సోకగానే మొదలవుతుంది. వీరికి నొప్పితో బాటు గొంతులో ఉండబెట్టినట్లుగా, గొంతులో ముల్లు గుచ్చుతున్నట్లుగా అనిపించి మింగినప్పుడు విపరీతమైన నొప్పి వచ్చుట గమనించదగిన ప్రత్యేక లక్షణం. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ప్రధానమెంది.
జెల్సిమియం:
వైరల్ ఇన్‌ఫెక్షన్ మూలంగా వచ్చే గొంతునొప్పికి ఈ మందు బాగా పని చేస్తుంది. గొంతు నొప్పి మూలంగా ద్రవ పదార్థాలు సైతం మింగడం కష్టంగా మారుతుంది. జ్వరంతో నీరసంగా, అస్తిమితంగా ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు వాడి ప్రయోజనం పొందే వీలు ఉంది.
మెరుస్కాల్:
గొంతునొప్పి రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటుంది. నోరు దుర్వాసన కొడుతుంది. నాలుక పెద్దదై నాలుకు చివర పళ్ళ అచ్చులు కనబడడం ఈ మందు ప్రత్యేక లక్షణం. వీరికి జలుబు చేసినప్పుడల్లా గొంతు నొప్పితో బాధపడుతుంటారు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ఆలోచించ దగినది. ఈ మందులే కాకుండా ఫెర్రం ఫాస్, కాలిమోర్, మెగ్‌ఫాస్, కాల్కేరియా, కార్బ్, సల్ఫర్, ఎపిస్ వంటి మందులను లక్షణ సముదాయమును బట్టి డాక్టర్ సలహా మేరకు వాడుకుని గొంతునొప్పి నుండి విముక్తి పొందవచ్చును.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top