దురదలకు కారణాలు - చికిత్స

ఇటీవల కాలంలో శరీరంపై దురదలు చాలా మందిలో కనిపిస్తుంటాయి. ఇవి అనేక కారణాల వల్ల వస్తాయి. 
స్కాబిస్: 
ఇది దురదతో కూడిన ఒక అంటువ్యాధి. ఇది సార్కోప్టెస్ స్కాబీ అనే ఒక పరాన్నజీవి వలన ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ జీవి చిన్నగా 1-3 మిల్లీమీటర్లు పొడవు ఉంటుంది. ఇది చర్మంలో రంధ్రాలు చేసి దురదను కలిగిస్తుంది.

దోమకాటు వలన, నల్లికాటు వలన, కుక్క లేదా పిల్లిని పెంచడం వలన వాటి ఒంటి మీద ఉండే రోమాల కారణంగా కూడా దురదతో కూడిన ఇన్ఫెక్షన్ ఉంటుంది. అయితే స్కాబిస్‌లో దురద రాత్రిపూట ఎక్కువగా ఉండటం, చర్మం కన్నాలు పడినట్లు ఉండటం గమనించవచ్చు.

వ్యాధి లక్షణాలు: 

ఇవి చర్మంపై చిన్నచిన్న కురుపులలాగా, రక్తంతో కూడిన బొబ్బల మాదిరిగా వస్తాయి. ఇవి చేతివేళ్ల మధ్యలో, మణికట్టు, కీళ్ల వెనుక, నడుము, నాభి, పాదాల దగ్గర ఎక్కువగా వస్తాయి. దురద మొదట తక్కువగానే ఉంటుంది. కాని కాలం గడిచేకొద్దీ దురద ఎక్కువ అవుతుంది. నిద్రాభంగం కూడా అవుతుంది.

అధిక దురద వలన చర్మం దెబ్బతిని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. 

వ్యాధి కారణాలు: 
వ్యాధిగ్రస్థులు వాడే వస్తువులు వాడటం వలన, ఇతరుల పక్కబట్టలు, వ్యాధి ఉన్నవారిని తాకినా వచ్చే అవకాశం ఉంది

నార్వేజియన్ లేదా క్రస్టెడ్ స్కాబిస్: 

ఇది స్కాబిస్‌లో తీవ్రమైన రకం. దీనిని మొదటగా నార్వేలో గమనించారు. ఇది సాధారణంగా మానసిక వికలాంగులలో, శరీరభద్రత వ్యవస్థ లోపించిన వారిలో, ఎయిడ్స్, లింఫోమా ఉన్న వారిలో రావచ్చు. మోకాళ్లు, అరచేతులు, నుదురు, అరికాళ్లలో ఎక్కువగా వస్తుంది. చర్మం మొదట పొడిబారిపోయి పొట్టులాగా ఏర్పడుతుంది. తర్వాత పులిపిర్లలాగ లేదా చీముగడ్డలలాగ మారుతుంది. గోళ్లు మందంగా అయ్యి, రంగు మారతాయి. దుర్వాసనతో కూడిన చెమటలు ఎక్కువగా పడతాయి. చలిని తట్టుకోలేరు. దురద ఉంటుంది కాని సాధారణ స్కాబిస్ ఇన్ఫెక్షన్‌లా ఇందులో దురద అంత తీవ్రంగా ఉండదు. పుండు ఉన్న చోట చుట్టూ చిన్నచిన్న కురుపులు ఏర్పడతాయి. లింఫ్ గ్రంథుల వాపు, జ్వరం, చలి, వికారం వంటి లక్షణాలు కనపడతాయి. మానసిక ఆం దోళన అధికమైన కొద్దీ దురద, చిరాకు, మంటలు ఎక్కువ అవుతాయి.

హోమియో చికిత్స: 

మెర్క్‌సాల్, హెపార్ సల్ఫ్, పెట్రోలియా, సారస్పరిల్లా, ఎకినీషియా వంటి మందులను వ్యాధి లక్షణాలను బట్టి, రోగి వ్యక్తిత్వాన్ని బట్టి పరిగణనలోకి తీసుకుని నిర్ధారణ చేస్తారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top