ఓట్స్‌ సగ్గుబియ్యం వడ


కావలసినవి
ఓట్లు: 100గ్రా., సగ్గుబియ్యం: 150గ్రా., బంగాళాదుంప: ఒకటి, బియ్యప్పిండి: 50గ్రా., ఉల్లిపాయ: ఒకటి, అల్లం: చిన్నముక్క, పచ్చిమిర్చి: 3, మజ్జిగ: సరిపడా, నూనె: వేయించడానికి సరిపడా, ఉప్పు: సరిపడా

తయారుచేసే విధానం  
  •  ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి సన్నగా తరగాలి.  
  •  బంగాళాదుంప ఉడికించి పొట్టు తీసి మెత్తగా చిదమాలి.  
  • సగ్గుబియ్యం, ఓట్లు మజ్జిగలో గంటసేపు నాననివ్వాలి.  
  • ఇప్పుడు సగ్గుబియ్యం, ఓట్లు మిశ్రమంలో చిదిమిన బంగాళాదుంప, ఉల్లిపాయముక్కలు, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, బియ్యప్పిండి, ఉప్పు అన్నీ వేసి కలపాలి.  
  • బాణలిలో నూనె వేసి కాగాక ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా వేసి ఎర్రగా వేయించి తీయాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top