వినూత్న ప్రయోగంతో మాటీవీలో ఛాలెంజ్ డాన్స్ షో

మాటీవీలో ఛాలెంజ్ డాన్స్ షో రెండు సిరీస్‌లను నడిపిన ఓంకార్ సరికొత్తగా ఛాలెంజ్-3 షోకి శ్రీకారం చుట్టాడు. ఆట సిరీస్.. ఛాలెంజ్ సిరీస్‌లను నడిపించడంలో కోడి-కోడిపిల్లల తరహాలో ఒకే డాన్సర్లను.. ఒకే జడ్జీలను తన వెంటే అంటి పెట్టుకున్నాడు. ఈ సిరీస్‌లలో డాన్సర్లు.. మెంటర్లుగా, మెంటర్లు.. జడ్జీలుగా ప్రమోషన్ పొందడం కూడా జరిగింది. అయితే పాత ముఖాలను చూసిచూసి ప్రేక్షకులకే కాదు.. ఈసారి ఓంకార్‌కి కూడా బోరు కొట్టిందేమో ఒక శివశంకర్ (సీనియర్ సినీ డాన్స్‌మాస్టర్)ని తప్ప అందరికీ సెలవిచ్చేశాడు.
 

తన డాన్స్ సిరీస్‌లతో ఓ ఊపు ఊపేసి ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎదిగిన ఓంకార్‌పై విమర్శలు కూడా అంతే రేంజ్‌లో లేచాయి. ఏకంగా ఫిర్యాదులు మానవ హక్కుల వరకు వెళ్లాయి. జరుగుతున్న షో రెండు వారాలు నిలిచిపోయిన సందర్భం కూడా ఏర్పడింది. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ సరికొత్తగా ఛాలెంజ్-3 కి శ్రీకారం చుట్టాడు.

ఇప్పటికే మాటీవీలో సోమ, మంగళ వారాలలో ఫిఫ్టీ-్ఫఫ్టీ గేమ్ షోతో తన హవాను కొనసాగిస్తున్న ఓంకార్ ఛాలెంజ్-3తో బుధ, గురువారాలను కూడా పట్టేసి వీక్లీ తానే సందడి చేయనున్నాడు. టెన్షన్ క్రియేట్ చేయడంలోగాని.. చక్కగా వ్యాఖ్యానం చేయడంలో గాని.. షోను ఆసక్తిగా నడపడంలోగాని ఓంకార్ స్టయిల్ ఏ మాత్రం మారకపోయినా ఒడిదుడుకులను ఎదుర్కొన్న నేపథ్యంలో న్యూమరాలజీ ప్రకారం తన పేరు స్పెల్లింగ్‌ని మాత్రం మార్చేసుకున్నాడు. ‘ఓక్’ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా మాటీవీ ప్రేక్షకులను రంజింపజేస్తున్నాడు.
 

ఫిఫ్టీ-ఫఫ్టీ గేమ్ షోలో పార్టిసిపెంట్స్ ఫైనల్‌గా గెలుచుకున్న మొత్తంలో ఎంతో కొంత తాను చూపించే సమస్య పరిష్కారం కోసం ఇవ్వండని అడగకనే అడిగే ఓంకార్ ఈసారి డాన్స్ షోలో కూడా ఈ ప్రక్రియనే ప్రవేశపెట్టాడు. నాట్యం కూడా సమాజ అభివృద్ధికి ఉపయోగపడాలనే కొత్త కానెసప్ట్‌తో ఆకర్షించాడు. మొత్తానికి తన షోలతో సమాజసేవకు ముడిపెట్టి కొంతవరకు ప్రేక్షకుల మార్కులు కొట్టేశాడనే చెప్పాలి. థర్టీన్ నుండి థర్టీ వరకు పార్టిసిపెంట్స్ ఈ డాన్స్‌షోలో పాల్గొంటారని సెలవిచ్చాడు.

 ఛాలెంజ్-3 విషయానికొస్తే 16 మందిని 16 జిల్లాల నుండి డాన్స్ చేయడానికి సెలెక్ట్ చేశాడు. ఈ పదహారు మందిని 4గురు చొప్పున 4 గ్రూపులు చేశాడు. ఒక్కో గ్రూప్‌కి కసి పెంచే పేర్లను పెట్టుకోమన్నాడు. 4 గ్రూపులను ఎంకరేజ్ చేయడానికి నలుగురిని సపోర్టర్లుగా ఎంపిక చేశాడు. వారిలో మాజీ సినీ తార రజని.. సెనే్సషనల్ రైటర్, నిర్మాత దర్శకుడు పోసాని కృష్ణమురళి కాగా మిగతా ఇద్దరిలో ఒకరు పవన్‌కల్యాణ్‌కి వరసగా కొరియోగ్రఫీ చేస్తున్న హరీస్‌పాయ్, మరొకరు శివశంకర్ మాస్టర్. వీరంతా ఓంకార్ కానెసప్ట్‌కి సెల్యూట్ చేశారు. శివశంకర్ మాస్టర్ ఓ అడుగు ముందుకేసి ఆదిలోనే 50 వేల విరాళాన్ని తన రెమ్యునరేషన్ నుండి ప్రకటించాడు.
 

16 మంది డాన్సర్లు 16 గ్రామాల సమస్యలకు ఓదార్పు కలిగించే ప్రతినిధులుగా ఉండి ఫైనల్‌గా ఎవరైతే విజయం సాధిస్తారో వారు తనకు లభించిన 25 లక్షల్లో తన డాన్సుకి ప్రతిఫలంగా 5 లక్షలు తీసుకుని మిగతా 20 లక్షలు తన ఎంపిక చేయబడిన గ్రామ సమస్యను కొంతైనా తీర్చడానికి డొనేట్ చేయాలి. ఓంకార్ (అందరి కీ అన్నయ్యే!)
మాత్రం 16 మందిని ఎంకరేజ్ చేస్తూ ఆశీర్వదించి ఇంట్రడక్షన్ ఎపిసోడ్ చేశాడు.
 

గత డాన్స్‌షోలలో కూడా దాన గుణం ప్రదర్శించిన ఓంకార్ ఈసారి ‘ఊరి కోసం డాన్స్’ అన్న కానె్సప్ట్‌లో టీవీ-9 వారిని కూడా మీడియా పార్ట్‌నర్‌గా చేశాడు. వివిధ జిల్లాలకు సంబంధించిన సమస్యలను ఓంకార్‌కి అందించడంలో టీవీ 9 ప్రజాపక్షం బాగా ఉపకరించినట్లు తెలుస్తుంది. ‘ఊరి కోసం పోరాటం’ కానెసప్ట్ సినిమాలకు పాతదే అయినా బుల్లితెరకు మాత్రం కొత్తదే. ఓంకార్ న్యూస్ పాపులర్ ఛానల్‌ని తన మీడియా పార్ట్‌నర్‌గా ఉంచుకోవడం కూడా విశేషమే.
 

సక్సెస్ సాధిస్తే రియాలిటీ షోల ఆదాయం ఎలా ఉంటుందో తెలియంది కాదు. ఇప్పటికే ఓంకార్ రియాలిటీ షోలతో సక్సెస్ సాధించాడు. ఈ వినూత్న ప్రయోగంతో ఛాలెంజ్-3 బాగానే ఆదరణ పొందేట్టు ఉంది. డాన్సర్లు మాత్రం ఊరి కోసం అహర్నిశలు శ్రమించాల్సి ఉంది. తిట్లు భారతం.. వాకౌట్లు.. అలకలు.. కష్టాలు.. కన్నీళ్లు ఓంకార్ షోలకు ప్రధాన ఆదాయం ప్లస్ క్రేజ్. వీటిలో కొన్ని ఇంట్రడక్షన్ ఎపిసోడ్‌లోనే దర్శనమిచ్చాయంటే ముందు ముందు జోరుగా కనిపిస్తాయనడంలో సందేహమే లేదు. ఈ సరికొత్త కానెసప్ట్ వలన ఆయా సమస్యాత్మక గ్రామాల ప్రజలు తమ కంటెస్ట్ కోసం భవిష్యత్‌లో ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కొంత ఖర్చు చేయక తప్పని పరిస్థితి కూడా ఎదురౌతుంది. షోకి ఇదీ ఓ రకమైన ఆదాయమే అవుతుందేమో! ఇది ఆ ఊరి వారితో సరిపెట్టక యావత్ ప్రేక్షకులను కదిలించి ఎస్‌ఎంఎస్‌ల ప్రవాహానికి దోహదపడుతుందని భావించక తప్పదు. మొత్తానికి ఛాలెంజ్-3 మిగతా డాన్స్ షోలకు ఓ ఛాలెంజే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top