సైనసైటిస్‌కు హోమియో మేలు

వైరల్, బాక్టీరియా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా సైనస్‌లలో విపరీతమైన నొప్పి పుడితే దాన్ని సైనసైటిస్ అంటారు. ముక్కు, కళ్ల చుట్టూ నాలుగు జతల రంధ్రాలు ఉంటాయి. వాటిన సైనస్‌లు అంటారు. మనం శ్వాస పీల్చినప్పుడు అది ముక్కు నుంచి సైనస్‌లలోకి వెళుతుంది. మన పీల్చే గాలిని సమశీతోష్ణస్థితికి తెచ్చే బాధ్యతను ఇవి నిర్వర్తిస్తాయి. సైనస్‌ల నుంచి వచ్చే ద్రవాలు ముక్కు ద్వారా బయటకు వెళతాయి.

సైనసైటిస్‌కు కారణాలు: సైనస్ ముఖద్వారం మూసుకుపోతుంది లేదా అక్కడ చాలా మ్యూకస్ పేరుకుపోతుంది. ఫలితంగా అక్కడ బాక్టీరియా, ఇతర క్రిములు సులభంగా పెరిగి సైనసైటిస్ వస్తుంది. అలాగే తరచు జలుబు చేయటం, అలర్జీలు రావటం వల్ల మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అయి, సైనస్ ముఖద్వారం మూసుకుపోవటం వల్ల కూడా సైనసైటిస్ సమస్య మొదలవుతుంది.


శ్వాసకోశ మార్గానికి ఇన్‌ఫెక్షన్ రావటం వల్ల సైనస్‌లకు బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వస్తుంది. ఫలితంగా తీవ్రమైన సైనసైటిస్ సమస్య మొదలవుతుంది. కొందరిలో సైనస్‌లలో వాపు రావటంతో పాటు, బాగా నొప్పిగా ఉంటుంది. చాలాకాలం పాటు ఈ సమస్యకు పరిష్కారం కాకుండా ఉండిపోతుంది. దీన్ని క్రానిక్ సైనసైటిస్ అంటారు.

గుర్తించటం ఎలా?

తరచు జలుబు చేయడం, జలుబుతో ఎక్కువ రోజులు బాధపడటం అనేది సైనస్ వ్యాధి ప్రాథమికలక్షణం. ఆ తరువాత దశలో జలుబు చేసినప్పుడు ముక్కులు బిగదీసుకుపోతాయి.తల అంతా బరువుగా ఉంటుంది. ఆపైన ముక్కు నుంచి పసుపు వచ్చని, ఆకుపచ్చని ద్రవాలు రావటం మొదలవుతుంది. తీవ్రమైన తలనొప్పి, దగ్గు, శ్వాస దుర్గంధంతో కూడి ఉండడం కూడా జరుగుతుంది. ఈ లక్షణాలతో పాటు కొందరిలో నిరంతరం ముక్కులో దురదగా ఉంటుంది.

ముఖం, తల అంతా బరువుగా ఉంటుంది. ఒక దశలో ముక్కు వెనుక భాగం నుంచి మ్యూకస్ గొంతులోకి వెళుతుంది. ముఖంలో వాపు కనిపిస్తుంది. పళ్లు, కళ్ల వెనుక భాగంలో కూడా నొప్పి కనిపిస్తుంది. కొద్దిరోజులకు వాసన తెలియకుండా పోతుంది. గొంతు మంటగా, నోరంతా చేదుగా మారుతుంది. కొందరిలో చెవి వినిపించకుండా పోతుంది.



మరికొందరిలో రెండు చెవులూ పనిచేయవు. అలసటగాతో పాటు తరచు జ్వరం వస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే ఆ వ్యక్తి సైనసైటిస్‌తో బాధపడుతు న్నాడని భావించాలి. ముఖ్యంగా ఈ సమస్య మొదలైతే సాధారణ మందులకు లొంగదు.

నిపుణులతో వ్యాధి నిర్ధారణ ఏ సైనస్‌లకు సమస్య ఉంటే ఆ ప్రాంతంలో నొప్పి, మొద్దుబారినట్టు అవడం జరుగుతుంది. కంటికి పైభాగంలో ఉండే సైనస్‌లకు సమస్య వస్తే, నుదిటి భాగం, కనుబొమ్మల ప్రాంతం అంతా నొప్పిగా ఉంటుంది. చెంపపైన ఉండే ఎముకలో సమస్య వస్తే కళ్లకింది భాగం, పైదవడ, పళ్లు నొప్పిగా ఉంటాయి. రెండు కళ్ల మధ్యభాగంలో ఉండే సైనస్‌కు సమస్య వస్తే ముక్కు చుట్టుపక్కల అంతా నొప్పి వస్తుంది. కళ్ల చుట్టూ కూడా వాపు వస్తుంది.

ముఖంలోపలి భాగాలకు సైనస్ సమస్య వస్తే తల, చెవి, మెడ నొప్పి వస్తుంది. సైనస్ తీవ్రంగా ఉన్నప్పుడు ఏ విషయం మీదా దృష్టి కేంద్రీకరించలేము. అంతా గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సత్వరం నిపుణులైన ఇ.ఎన్.టి. వైద్యుల్ని సంప్రదించాలి.


పరీక్షలు:
వైద్యులు కొన్ని పరీక్షలు చేసి, వ్యాధి ఎంత తీవ్రంగా ఉందో నిర్ధారిస్తారు. సాధారణ ఎక్స్‌రేల వల్ల ఫలితం ఉండకపోవచ్చు. ఫైబర్ ఆప్టిక్ స్కోప్ ద్వారా వ్యాధి నిర్ధారణ సులువు అవుతుంది. కొన్ని సందర్భాల్లో సిటిస్కానింగ్ చేయాల్సి వస్తుంది. సిటి స్కాన్ చేస్తే సర్జరీ అవసరమా? కాదా? అనే విషయం నిర్ధారణ అవుతుంది. ఎం.ఆర్. ఐ. చేయించటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. వీటితో పాటు అలర్జీ టెస్ట్, రక్తపరీక్షలతో పాటు వైద్యుల పర్యవేక్షణలో మరికొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

సర్జరీ అవసరం లేని పరిష్కారం అల్లోపతి వైద్య విధానంలో సైనసైటిస్ సమస్యకు సర్జరీ మాత్రమే పరిష్కారం అవుతుంది. అయితే హోమియోపతి వైద్య విధానం ఎంతో కాలంగా సైన సైటిస్‌కు ఇబ్బంది లేని చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది. సైనస్ సమస్యపై హోమియోలో సుదీర్ఘ పరిశోధనలు చేసి, చక్కటి ఔషధాలను కనుగొన్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top