రక్తపోటు నియంత్రణకు తీసుకోవలసిన ఆహారం

ఈ అహార ప్రణాళిక ద్వారా ఒక వ్యక్తికి 2,000 క్యాలరీలు సమకూరి 14రోజుల్లో బీపీ నియంత్రణలోకి వస్తుంది.
గింజధాన్యాలు: గోధుమ పిండితో తయారుచేసిన 7 బ్రెడ్ స్లైసులు లేదా 3 కప్పుల అన్నం లేదా ఉడికించిన ఇతర గింజ ధాన్యాలు లేదా ఓట్‌మీల్, ఆరు పుల్కాలు(సాధారణ సైజువి) లేదా 3 కప్పుల పాస్తా లేదా మొక్కజొన్న. 
కూరగాయలు: ఒక కప్పు టొమాటో ముక్కలు, ఒక కప్పు ఉడికించిన బంగాళదుంపలు, ఒక కప్పు ఉడికించిన కారెట్లు, తక్కువ నూనెతో వండిన కూర, కూరగాయలతో చేసిన రెండు కప్పుల జ్యూస్. ఇలా 4-5 రకాల కూరగాయలు రోజూ భోజనంలో ఉండాలి. 
పండ్లు: ఇవి కూడా రోజులో 4-5 రకాలు తీసుకోవాలి. 300 మి.లీ పండ్ల రసం (కమలాల జ్యూస్ మేలైనది), 1-2 అరటిపండ్లు, అన్నిరకాల పండ్ల ముక్కలు కలిపి తయారు చేసిన 2 కప్పుల సలాడ్, (బత్తాయి, పైనాపిల్, పుచ్చకాయ, బొప్పాయి). 
వెన్నశాతం తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు: పావు లీటర్ పాలు, పావు లీటరు పెరుగు, 50 గ్రా. చీజ్ లేదా పనీర్.
మాంసం: కొవ్వులేని 150గ్రా. ఉడికించిన మాంసం; చేపలు.

నట్స్: రోజుకు బాదంపప్పు 15, పొద్దుతిరుగుడు గింజలు 15 తీసుకోవాలి.
తృణధాన్యాలు: రోజుకు 150 గ్రా.లు. రాజ్మా, శనగలు, పెసలు. కొవ్వు, నూనెలు: రోజుకు 20 గ్రా.లు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top