హోమ్‌మేడ్ క్లెన్సర్ (ముఖానికి ప్యాక్ )

టొమాటో గుజ్జులో కొద్దిగా నీరు పోసి బాగా కలిపి ఆ గుజ్జును వడపోయాలి. ఇందులో కప్పుడు పాలు కలిపితే హోమ్‌మేడ్ క్లెన్సర్ రెడీ. కాటన్‌బాల్‌ను ఈ మిశ్రమంలో ముంచి, ముఖానికి, మెడకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా రోజుకు ఒకటి లేదా రెండుసార్లు చేయవచ్చు.

ఈ క్లెన్సర్ జిడ్డు చర్మానికి, కాంబినేషన్ స్కిన్‌కు చక్కటి ఫలితాన్నిస్తుంది. నార్మల్ స్కిన్, సీజనల్ స్కిన్ వాళ్లు కూడా వాడవచ్చు. కానీ డ్రైస్కిన్ వాళ్లు మాత్రం వెన్న తీయని పాలను వాడితే మంచిది. ఒకేసారి నాలుగు రోజులకు సరిపడినంత క్లెన్సర్‌ను చేసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top