క్యారట్‌ను పేస్ట్ చేసుకుని అందులో అయిదారు చుక్కల నిమ్మరసం, చిటికెడు పసుపు, టీ స్పూన్ ఓట్స్ పౌడర్, టీ స్పూన్ మిల్క్ క్రీమ్ (పాల మీగడ), చిటికెడు గంధం పొడి, రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి అన్నిటినీ కలుపుకోవాలి. స్నానానికి ముందు ముఖానికి, మెడ, కాళ్ళు, చేతులకు అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.