ఈ సీజన్‌లో అమృతం వేడి నీళ్లు - వేడి నీళ్లు సేవించడం వల్ల ప్రయోజనం

వర్షాకాలం, చలికాలాల్లో గోరువెచ్చని నీళ్లు తాగమంటూ సలహా ఇస్తారు వైద్యులు. వయోధికులు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా వేడినీళ్లు తాగుతూ ఉంటారు. ఇలా వేడి నీళ్లు సేవించడం వల్ల ప్రయోజనం ఏమిటో చూద్దాం.

  •   వేడినీళ్లు తాగడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది. వేడినీళ్లు తాగిన వెంటనే మన శరీరంలో ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. కొందరిలో చిరుచెమటలు పడతాయి. అలా చెమట ద్వారా శరీరంలో ఉన్న మలినాలు బయటకు వెళ్లి పోవడం వల్ల శరీర శుద్ధి జరుగుతుంది.
  •   నరాలు, కండరాలు కూడా చురుకుగా పనిచేసేందుకు వేడినీళ్లు ఉపయోగపడతాయి. నరాలు చురుకుగా ఉండడం వల్ల మన ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి. అంటే వేడినీళ్లు తాగడం వల్ల శరీరం, మనసు రెండూ శుద్ధి అవుతాయాన్నమాట.
  •   ఈ సీజన్‌లో ఎక్కడ చూసినా జ్వరాలు, జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్న వారు కనిపిస్తారు. ఇలా జలుబు, దగ్గు బాధిస్తున్నప్పుడు తప్పనిసరిగా గోరువెచ్చని నీళ్లు తాగాలి. తద్వారా శ్వాస సక్రమంగా ఆడుతుంది. ముక్కు దిబ్బడ తగ్గుతుంది. వేడినీళ్లలో ఒక చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే మరింత ప్రయోజనం ఉంటుంది.
  •   బాగా జలుబు చేసినప్పుడు రోజుకు రెండుసార్లు వేడినీళ్లలో కాస్త విక్స్, లేదా పసుపు, వేప ఆకులు వేసి ఆవిరి పట్టండి. ఎంత రిలీఫ్‌గా ఉంటుందో మీరే గమనించండి.
  • వేడినీళ్లు తాగమన్నారు కదా అని బాత్‌రూమ్‌లో గీజర్ నుంచి పట్టిన నీళ్లు తాగ కూడదు. ఫిల్టర్ నుంచి పట్టిన నీళ్లను స్టౌ మీద తగినంతగా వేడిచేసుకొని తాగాలి. గీజర్ నుంచి పట్టిన నీళ్లలో లోహ వ్యర్థాలు ఉండే ప్రమాదం ఉంది. ఆ నీళ్లు తాగితే మేలు జరగకపోగా, నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
  •   మండు వేసవిలో మినహా మిగిలిన రోజుల్లో ఎప్పుడు వీలయితే అప్పుడు వేడినీళ్లు తాగండి. చైతన్యం పొందండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top