ఆలూ టమాటా పకోడీ


కావల్సినవి: 
 బంగాళాదుంపలు- నాలుగు( ఉడికించి మెత్తగా చేయాలి), టమాటా- ఒకటి(పెద్దది), జీలకర్రపొడి- చెంచా(వేయించి పొడి చేయాలి), జీలకర్ర- పావుచెంచా, ఉప్పు- రుచికి తగినంత, మిరియాలు- పావుచెంచా, బఠాణీల పొడి- మూడుచెంచాలు, నూనె- వేయించడానికి కొద్దిగా.
తయారీ: 
బంగాళాదుంప మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకొని అందులో జీలకర్ర, జీలకర్ర పొడి, ఉప్పు, మిరియాలు, బఠాణీల పొడి.. టమాటా తరుగు చేర్చి బాగా కలిపి పక్కన పెట్టాలి. అరగంటయ్యాక బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక బంగాళాదుంప మిశ్రమాన్నిచేత్తో తీసుకొని పకోడీలా వేయాలి. బంగారువర్ణంలోకి వచ్చాక తీస్తే సరిపోతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top