తిండి మానకుండా బరువు తగ్గొచ్చు.

పొట్ట మాడ్చుకోందే బరువు తగ్గలేమా అని బాధపడేవాళ్లకో శుభవార్త. అదేంటంటే పొట్ట మాడ్చుకునే అవసరం లేకుండా ఒక పక్క మీకు నచ్చిన తిండి లాగిస్తూనే బరువు తగ్గొచ్చు. అబ్బో ఇలాంటి ప్రకటనలు చాలానే చూశాం.

నమ్మే సమస్యే లేదంటున్నారా... అయితే ఇది చదవాల్సిందే మీరు. పదిరోజుల పాటు లంచ్‌ని కాస్త కంట్రోల్‌గా తీసుకుని చూడండి దాదాపుగా 1.1 పౌండ్లు అంటే అరకేజి తగ్గుతారు.

ఈ విధానాన్ని క్రమం తప్పకుండా అనుసరిస్తే ఏడాది కాలంలో 11.3 కేజీల వరకు తగ్గొచ్చు అంటున్నారు న్యూయార్క్ విశ్వవిద్యాలయం పరిశోధకులు. ఆకలిని చంపుకోకుండా ప్రొటీన్లు, పీచు పదార్ధాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే చాలనేది వారి పరిశోధనా ఫలితం. ఈ పద్ధతి కూడా రోజూ అనుసరించలేని వాళ్లు వారంలో కొన్నాళ్లు ఫాలో అయినా సరిపోతుందట.



మొత్తంమీద వీళ్లు చెప్పొచ్చేదేమిటంటే. పొట్ట మాడ్చుకుని తగ్గే బరువుకంటే క్రమశిక్షణతో తింటూనే తగ్గే బరువు నిలకడగా ఉంటుందని. ఇకనేం ఫాలో ది రూల్. 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top