నోటి దుర్వాసన తగ్గేదెలా?

నోటి దుర్వాసన రెండు, మూడు కారణాల వల్ల వస్తుంది. దంత సమస్యలు కూడా కారణం కావచ్చు. దంతాలలో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లయితే దుర్వాసన వచ్చే అవకాశంఉంది. చిగుళ్ల సమస్యలు, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం కూడా నోటి దుర్వాసనకు కారణమవుతుంది.అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. 

తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం, మలబద్ధకం లేకుండా చూసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి చేయాలి. అహారాన్ని బాగా నమిలి తినాలి. డైజేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. దంత సమస్యలు ఉన్నట్లయితే వాటికి చికిత్స తీసుకోవాలి. దంతాలు పుచ్చిపోయి ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడం చేయాలి. ఇతరులతో మాట్లేటప్పుడు నోట్లో లవంగాలు వేసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ నోటి దుర్వాసన దూరమవుతుంది.
 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top