పచ్చి వెల్లుల్లి... ఫలితమెంతో!

ఒకే రకమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు, పీచు అధికంగా ఉండి బహుముఖ ప్రయోజనాలు అందించే వాటిని ఆహారంలో చేర్చుకొంటే అనారోగ్య సమస్యలు తలెత్తవు.
  •  ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండే బాదం పప్పులు ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి సహకరిస్తాయి. మెదడు పనితీరుని చురుగ్గా ఉంచే వీటికి చర్మాన్ని, కురులను నిగనిగలాడించే శక్తీ అధికమే. ఇవి ఎముకల బలానికి ఉపయోగపడతాయి. పునరుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేసేట్టు చేసి శరీర పనితీరును చురుగ్గా ఉంచుతాయి.
  • ఒక్క యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు మాత్రమే కాకుండా యాంటీవైరల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు కూడా సొంతమైన పదార్థం వెల్లుల్లి. దీన్ని తినేవారిలో వ్యాధినిరోధక శక్తి అపారంగా ఉంటుంది. కాకపోతే వండుకొని తినడం వల్ల సుగుణాలు కోల్పోతాం.

  • బరువు తగ్గాలనుకొనేవారు.. పీచు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండే పెసర మొలకలు తినడం వల్ల ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top