ఆరోగ్యానికి వెరైటీ సూప్‌లు!

ఈ సీజన్‌లో రెండురోజులకు ఓ సారి ముసురు పడుతూ ఉంటుంది. ముసురులో వేడివేడి పకోడీలు, బజ్జీలు తింటే మజాగా ఉంటుంది కానీ శనగపిండి, నూనె తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది వాటికి దూరంగా ఉంటారు. ముఖ్యంగా 60 దాటిన వారు వాటి జోలికి వెళ్లేందుకు భయపడతారు. ఇది ఫిట్‌నెస్ యుగం కాబట్టి వాటిని తినేందుకు యూత్ కూడా అంతగా ఇష్టపడదు. అందుకే అలాంటి వారికి కోసం ముసురు వేళ, వేడివేడిగా పొగలు చిమ్మే సూప్‌లు అన్ని విధాలా మంచిది. సూప్‌లు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు జిహ్వ చాపల్యాన్ని కూడా చల్లారుస్తాయి. సూప్‌లు చేసుకోవాలంటే చాలా కష్టం అనుకొనే వారికి ఇప్పుడు ఇన్‌స్టంట్ సూప్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. రెడీమిక్స్‌లు మాకొద్దు అనే వారు ఇంట్లోనే పెద్దగా కష్టపడకుండా సూప్‌లు తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

టొమాటో సూప్: 
ప్రతి ఒక్కరి ఇంట్లో నిత్యం ఉపయోగించే అమృతఫలం టొమాటో. తక్కువ ఖర్చుతో టొమాటో సూప్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ఈ సూప్ రుచిగా ఉండడంతో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. విటమిన్‌లతో పాటు గ్లూకోజ్ కూడా టొమాటో నుంచి పుష్కలంగా లభిస్తుంది. రోజుకు రెండు సార్లు టొమాటో సూప్ తీసుకుంటే ఎటువంటి జబ్బులు దరిచేరవంటున్నారు పోషకాహార నిపుణులు.

బీన్స్, క్యారెట్, క్యాబేజీలు సన్నగా ముక ్కలు చేసి, కాసేపు ఉడికించి, అందులో కార్న్‌ఫ్లోర్, మిరియాలు వేసుకొని వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సీజన్‌లో ఆరోగ్యాన్ని పెంపొందించే సూప్‌లలో ఇది ఒకటి. జ్వరాన పడి, నీరసంగా ఉన్న వారు రోజుకు రెండు సార్లు ఈ సూప్ తీసుకోవడం వల్ల త్వరగా కోలుకుంటారు.


ఈ సీజన్‌లో ఎక్కువ మంది గొంతు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ ఉంటారు. జలుబు చేస్తే వారం రోజులకూ తగ్గదు. యాంటీబయాటిక్స్ ఎన్ని మింగినా ఫలితం ఉండదు. ఇలాంటి సమయంలో చింతపండు తక్కువగా వేసి, మిరియాల చారు చేసుకొని ఉదయం సాయంత్రం తీసుకోవడం వల్ల కఫం తొలగిపోయి, శ్వాస తేలికపడుతుంది.

నిమ్మరసం, శొంఠి, తేనె, అల్లం... వీటిని వేరువేరుగా వేడి నీటిలో కలిపి రోజుకు నాలుగైదుసార్లు తీసుకోవడం వల్ల దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్‌ల నుంచి ఉపశమనం కలుగుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top