బ్రెయిన్‌ను జిమ్‌కు పంపండి!

మనిషి మెదడు ఇక పెద్దగా ఎదగదంటూ తాజా పరిశోధన వెల్లడించింది. ఎదగకపోవడం సంగతి అటుంచితే నిజానికి చాలామంది వారి మెదడులో తక్కువ భాగాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నారంటున్నారు నిపుణులు. నిరంతరం చైతన్యాన్ని రగిలించే కార్యకలాపాలు లేకపోవడం, జీవితం నిస్తేజంగా మారడం వల్లకూడా మెదడుకు తగినంత పనిలేకుండా పోతున్నది. మెదడుకు కొన్ని రోజులు సరిగా పనిచెప్పకపోతే బద్ధకం పెరిగిపోతుంది.

మళ్లీ అవసరం అయినప్పుడు వెంటనే అది చురుగ్గా
పనిచేయలేదు.
అందుకే మెదడునునిరంతరం చురుగ్గా ఉంచుకొనేందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు అవేంటో చూద్దాం. 

  •  పచ్చని చెట్ల మధ్య, ఆరుబయట నడవడం లేదా వ్యాయామం చేయడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. *ఎప్పుడూ ఇంటికి, ఆఫీసుకు పరిమితం కాకుండా ఆలా సంవత్సరంలో రెండుమూడు సార్లు టూర్‌లకు వెళ్లడం వల్ల మనసు తేలిక పడుతుంది. బుద్ధి వికసిస్తుంది.
  •   రోజూ ఒకే పనిని ఒకే రకంగా చేయడం వల్ల మనం చేసే పని పట్ల అనాసక్తి పెరుగుతుంది. అందుకే మీరు చేసే పనిని భిన్నంగా చేసేందుకు ప్రయత్నించండి. ఉదాహరణకు మీరు రోజూ కుడిచేత్తో రాస్తారు.ఈ రోజుకి ఎడమ చేత్తో రాసేందుకు ప్రయత్నించండి. టీవి రిమోట్‌ను ఎడమచేత్తో అపరేట్ చేసి చూడండి. బ్రెషింగ్ కూడా ఎడమచేత్తో ట్రై చేయండి. ఛా! ఇదేం పిచ్చిపని అని మీరు అనొచ్చు. కానీ ఇది మెదడుకుమాత్రం మంచి మేత అవుతుంది.

  • కొత్త విషయాలపై ఆసక్తి పెంచుకోవడం వల్ల మనం చురుగ్గా ఉంటాం. ఉదాహరణకు మీరు ఏ నాడూ మిత్రుడికి ఒక ఉత్తరం రాయలేదు. అవసరం అయితే ఎప్పడైనా ఫోన్‌లో మాట్లాడేవారంతే. వెరైటీగా మీ మిత్రుడికి ఓ లేఖ రాయండి. కొత్త విషయాన్ని నేర్చుకొనేందుకు మీ మెదడు కుస్తీ పడుతుంది. ఆ ప్రయత్నంలో అది చురుగ్గా మారుతుంది.
  •   ఏకకాలంలో రెండు పనులు చేయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఉదాహరణకు వంట చేస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సంగీతం వినండి. అటువంట మీద, ఇటు సంగీత మీద మీ దృష్టి కేంద్రీకృతం అవుతుంది. మెదడు వేగంగా పనిచేస్తుంది. 
  •  యోగ, ధ్యానం మెదడును పాదరసంలా మారుస్తాయి. మెదడు ఇక ఎదగదట అని బాధపడే బదులు, ఈ సూత్రాలను ఉపయోగించి మెదడును చురుగ్గా పనిచేయించేందుకు ప్రయత్నిస్తారు కదూ?
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top