దాల్‌పొంగల్‌


కావల్సినవి:
బియ్యం - కప్పున్నర, బెల్లం తురుము - కప్పు, కందిపప్పు - అరకప్పు, యాలకులు - రెండు చెంచాలు, జీడిపప్పు, ఎండుద్రాక్ష- అన్నీ కలిపి అరకప్పు, కొబ్బరి ముక్కలు - అరకప్పు, నెయ్యి - రెండు చెంచాలు.
తయారీ: 
 బియ్యం, కందిపప్పు, శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు చేర్చి కుక్కర్‌లో రెండు విజిళ్లు వచ్చేదాకా ఉడికించాలి. ఇప్పుడు ఓ బాణలిలో నెయ్యి కరిగించి యాలకులు, కొబ్బరిముక్కలు వేయించి నెయ్యితో సహా అన్నంలో వేయాలి. అదే బాణలిలో బెల్లం తురుము, అరకప్పు నీళ్లు తీసుకుని తీగపాకం వచ్చేదాకా పొయ్యి మీద ఉంచాలి. ఈ పాకంలో ఉడికించి పెట్టుకున్న అన్నం చేర్చి బాగా కలిపి సన్నటి మంటపై ఉంచాలి. దగ్గరగా అయ్యాక పొయ్యి కట్టేసి జీడిపప్పు, ఎండుద్రాక్షతో అలంకరించుకొంటే రుచికరమైన దాల్‌పొంగల్‌ సిద్ధమయినట్టే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top