మంచి ఆహారంతో మెరిసే జుట్టు

అందంగా కనిపించాలనే చాలా మంది తాపత్రయ పడుతుంటారు. కానీ ముఖంపై వచ్చే మొటిమలు, హెయిర్ ఫాల్ వారిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే చర్మం నిగారింపు సంతరించుకోవాలన్నా, శిరోజాలకు షైనింగ్ రావాలన్నా చక్కటి ఆహారం తీసుకోవడం ఒక్కటే మార్గమంటున్నారు నిపుణులు.

  • ఈ శిరోజాలు రాలడంతో పాటు తల పొడిబారటం వంటి లక్షణాలున్నట్లయితే బయోటిన్, జింక్, ఐరన్, ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్ లోపం ఉన్నట్లుగా భావించాలి.
  • ఈ ఒత్తిడి, ప్రెగ్నెసీ, చర్మవ్యాధులు, మందులు, జన్యుపరమైన కారణాలతోపాటు వయస్సు కూడా కారణం కావచ్చు. శిరోజాలకు వాడే రంగులు కూడా హెయిర్ ఫాల్‌కు కారణం కావచ్చు.
  • ఈ హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉందంటే తీసుకునే ఆహారంలో ప్రొటీన్, ఫ్యాట్ శాతంపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలా చూసుకోవాలి.

  • ఈ రోజు వారి మెనూలో విటమిన్-ఎ, సి, బి-కాంప్లెక్స్, ఐరన్, ఫోలిక్‌యాసిడ్ తగినంత లభించేలా చూసుకోవాలి. శిరోజాలు ఆరోగ్యంగా ఉండటానికి ఇవి ఉపకరిస్తాయి.
  • ఈ చేపలు, కోడిగుడ్లు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. కాఫీ, ఆల్కహాల్, నికోటిన్, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ఈ సలాడ్‌తో పాటు వాల్‌నట్స్ తీసుకోవచ్చు. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వెజిటబుల్ జ్యూస్, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకుంటే శిరోజాలు ధృడంగా ఉంటాయి.
  • మొటిమలకు...ఈ బాక్టీరియా, చుండ్రు, కాస్మెటిక్స్ వంటివి మొటిమలకు కారణమవుతాయి. కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా విడుదలవడం కూడా కారణమే.
  •  ఈ చర్మం నిగనిగలాడుతూ ఉండాలంటే ఆహారంలో ప్రొటీన్‌తో పాటు తగినంత ఫ్యాట్ కూడా ఉండేలా చూసుకోవాలి.
  • ఈ చేపలు, అవొకడో వంటి ఫ్రూట్స్ తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ఒమెగా 3, జింక్ మొటిమలను అరికడతాయి. ఈ జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. కాఫీ, ఆల్కహాల్, రెడీ మీట్, వేయించిన పదార్థాలను తీసుకోకూడదు.
  • ఈ రోజూ ఒక గ్లాసు క్యారట్ జ్యూస్ తీసుకుంటే విటమిన్-ఎ తగినంత అందుతుంది. బ్రొక్కోలి, క్యాలీఫ్లవర్, పాలకూర రోజూ మెనూలో ఉండేలా చూసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top