దాసరి టార్గెట్ ఎవరి మీద...?మెగా హీరోలేనా..?


మహానటుడు ఎస్వీ రంగారావుగారి పురస్కారం అందుకున్న దర్శకుడు దాసరి నారాయణరావు ప్రస్తుతం వెండితెరను ఏలుతున్న హీరోలు జీరోలుగా ఉన్నారాని, కనీసం ఎక్స్ ప్రెషన్స్ కూడా చేతకాదు అని ధ్వజమెత్తాడు. క్లబ్ డ్యాన్స్ లు వేయంగానే వీళ్ళు నటులు ఎలా అవుతారని, డైలాగ్ చెప్పటం రానివాళ్లు హీరోలుగా ఉండటం మన తెలుగు చిత్ర పరిశ్రమకు పట్టిన దరిద్రమని ఉపన్యాసం దంచారు. ఇంతకీ దాసరి ఎవరిని టార్గెట్ చేసి ఇన్ని శాపనార్థాలు పెట్టారు? ఇప్పుడున్న హీరోలకు తెలుగు ఎవరికి రాదు? ముఖం మీద ఎక్స్ ప్రెషన్స్ ఎవరికి పలకవు? అసలు దాసరి ఆంతర్యం ఏమిటి?

ఇప్పుడొస్తున్న యువ హీరోలు మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్. ఈ నలుగురూ లీడింగ్ హీరోలుగా ఎవరు అన్నా అనకపోయినా మనందరం ఒప్పుకోని తీరాల్సిందే.. ఈ నలుగురి లో ఎన్టీఆర్, అర్జున్, రామ్ చరణ్ డాన్సులలోనూ, ఫైట్స్ లోనూ ఆరితేరిన వారే! మహేష్ బాబు వీళ్ళందరి కంటే అందగాడు, ఫైట్స్ హీరోయిజం ఉన్నవాడే. ఇక నటన విషయానికి వస్తే జూ ఎన్టీఆర్, అర్జున్ డైలాగ్ రెండరింగ్ లో అదరగొట్టేస్తారు. మహేష్ బాబు, రామ్ చరణ్ వీళ్ళిద్దరంత బాగా చెప్పకపోయినా బాగానే చెబుతారు. ఇకపోతే ఈ నలుగురు తమ సత్తా చాటుకొని రికార్డులు సృష్టించిన వారే.

మరి దాసరి ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు? ఈ నలుగురి హీరోలలో ఆయనకు నచ్చని హీరో ఎవరు? దాసరి గారిని కొంచెం పరిశీలిస్తే...చిరు మీద ఉన్న కోపాన్ని అర్జున్, చరణ్ లమీద చూపిస్తున్నాడా? అనేది ఆయన ఆహాభావాల ప్రదర్శనలో తెలిసిపోతుందని ఫిలింనగర్ న్యూస్. దాసరి అంటేనే ఆమడ దూరంగా ఉన్న చిరు మీద తన కోపాన్ని ప్రదర్శించలేక ఇలా తన కోపాన్ని వెళ్ళగక్కుతున్నాడని రాజకీయ పరంగా, సినీ పరంగా దాసరిని పట్టించుకోక పోవడంతో, ఇలా అప్పుడప్పుడు కలవరిస్తాడని ఫిలిం వర్గాలు చెప్పుకుంటున్నాయి...
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top