యోగా ఎందుకు చేయాలి?

వ్యాయామం కంటే యోగా ఎన్నో రెట్లు మంచిది. సైకలాజికల్, ఎమోషనల్ పద్ధతుల ద్వారా శరీరాన్ని శక్తిమంతం చేస్తుంది. అధిక బరువు ను, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా బాగా ఉపకరిస్తుంది. శరీరానికి, మనసుకు తగిన ప్రశాంతత లభించాలంటే యోగా ఒక్కటే మార్గం. ఈ అధిక బరువును తగ్గించుకోవాలని చూస్తున్న వారికి యోగా మంచి ఆప్షన్. ప్రతిరోజు యోగా చేస్తే క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఎంత అంటే ఎరోబిక్ ఎక్సర్‌సైజులు చేసిన దానితో సమానంగా. ఫ్యాట్‌ను కరిగించుకోవడానికి రకరకాల యోగా భంగిమలు ఉపకరిస్తాయి. జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి.

  •   పొట్ట కండరాలు బలోపేతం కావడానికి యోగా బాగా ఉపకరిస్తుంది. పొట్టభాగంలో అదనపు కొవ్వు కరిగి నడుము నాజూకుగా కావాలనుకునే వారు యోగా చేయాల్సిందే.
  •   ఉదయాన్నే ప్రాణాయామం చేస్తే బాడీ సిస్టమ్ మొత్తం ఉత్తేజం అవుతుంది. శ్వాసకు సంబంధించిన యోగాసనాలు కార్టిసాల్ హార్మోన్‌ను ఉత్తేజపరుస్తాయి. ఈ హార్మోన్ శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది.
  •  రోగనిరోధక వ్యవస్థ బలహీనపడితే అలర్జీలు విజృంభిస్తాయి. ఇటువంటి సమయంలో యోగా చేస్తే అలర్జీలపై పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది. *డిప్రెషన్, ఒత్తిడి ప్రభావం శృంగార జీవితంపై ఉంటుంది. శరీరానికి, మనసుకు అవసరమైన ప్రశాంతతను యోగా అందిస్తుంది. బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు మనసుకు కావలసిన రిలాక్సేషన్‌ను అందిస్తాయి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top