మొటిమలు - హోమియో చికిత్స

టీనేజర్స్‌ని ఎక్కువగా బాధించే సమస్య మొటిమలు. నిజానికి ఇవి నలభై ఏళ్లుపైబడినవారికి కూడా వస్తాయి. కేవలం ముఖంపైనే కాదు, చేతులు, ఛాతీ, వీపు వంటి భాగాలపైనా మొటిమలు వస్తాయి. నాలుగు స్థాయిల్లో వేధించే ఈ సమస్య తీవ్రత కొందరిలో ఎక్కువగా ఉంటుంది. మొటిమలు వచ్చి తగ్గేదశలో కొందరికి మచ్చలు పడితే, మరికొందరికి గుంటలు పడతాయి. ఎంతోబాధించే వీటి రాకకు కారణాలు తెలుసుకుందాం. 

హార్మోన్లలో చోటు చేసుకునే మార్పులు చర్మంలో నూనె గ్రంథుల పనితీరు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. పరోక్షంగా ఒత్తిడితోనూ కొన్నిసార్లు వస్తుంటాయి.

పిసిఒడి, కొన్నిరకాల ఉత్ప్రేరకాలు, గర్భనిరోధక మాత్రలు, క్షయకు వాడే మందులు వంటివి ఈ సమస్యకు దారితీస్తాయి.

మొటిమలు స్వేదగ్రంథులకు సంబంధించిన చర్మవ్యాధి. మొటిమలు ముఖంపైనే కాకుండా మెడ, భుజం, ఛాతీపైన కూడా పుడుతూ ఉంటాయి. 70 శాతం నుంచి 80 శాతం వరకు ఇవి యువతీ యువకులలోనే ఎక్కువగా కనిపిస్తాయి.

యుక్తవయసులో వచ్చే మొటిమలు చిన్నవిగా ఉంటాయి. కొందరికి 40 ఏళ్ల వయసులో కూడా వస్తాయి. ఇవి కొంచెం పెద్దవిగా ఉండి, నొప్పి, దురదతో కూడుకొని ఉంటాయి.

మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు, ఆడవారిలో పిసిఓడి ఉన్నప్పుడు, వంశపారంపర్యకారణాలు, అయిలీ స్కిన్ తత్వం ఎక్కువ ఉండటం.



జాగ్రత్తలు: 
ముఖాన్ని రెండుపూటలా సబ్బుతో కడుక్కోవాలి. జిడ్డుముఖమైతే నూనె, కొవ్వు పదార్థాలు తినడం తగ్గించాలి. రోజూ కొద్దిసేపు వ్యాయామం చెయ్యాలి.

మొటిమలు పడ్డప్పుడు వాటిని చిదపడం, గిల్లడం చేయరాదు, తువ్వాలుతో ముఖం గట్టిగా తుడవరాదు.


తాజాగా ఉన్న ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు తీసుకోవాలి. నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోరాదు.


స్వీట్స్, కూల్‌డ్రింక్స్, ఆయిల్‌ఫుడ్స్, కొవ్వు అధికంగా ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. గోరువెచ్చని నీటితో ముఖాన్ని రోజుకు 4, 5సార్లు తుడుచుకోవాలి. తగినంత నిద్రపోవాలి.


హోమియో చికిత్స: 

మొటిమలకు హపార్ సల్ప్, కాస్టికం, బెరిబెరి, పల్సటిల్లా, కార్బోవినిమలిస్, నేట్రంమూర్ అనే మందులు వైద్యుని పర్యవేక్షణలో వాడవలసి ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top