కావల్సినవి:
బియ్యం - కప్పు, పాలు - రెండు కప్పులు, పంచదార - అరకప్పు, నెయ్యి - కప్పు, కొబ్బరి - సగం చెక్క, యాలకులు - రెండు, బాదం, జీడిపప్పు - రెండూ కలిపి పావుకప్పు.
తయారీ:
బియ్యం కడిగి నానబెట్టుకొని మర్నాడు మెత్తగా, గట్టిగా రుబ్బుకోవాలి. బాదంపప్పును నానబెట్టి పై పొట్టు తీసి పలుకుల్లా కోసి, జీడిపప్పుతో కలిపి చెంచా నెయ్యితో వేయించుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి గిన్నెలో పాలు తీసుకుని పొయ్యి మీద ఉంచాలి. అవి మరుగుతుండగా సిద్ధం చేసి పెట్టుకున్న బియ్యంపిండి, పంచదార, కొబ్బరి కోరు, నెయ్యి చేర్చాలి. మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. కాసేపటికి ఇది ఉడికి ముద్దగా మారుతుంది. అందులో యాలకులపొడి, వేయించిపెట్టుకున్న బాదం, జీడిపప్పు పలుకుల్ని వేసి.. నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసుకొని చల్లారాక బిళ్లలా కోయాలి. కమ్మటి బియ్యంబర్ఫీ సిద్ధం.