నాజూకైన శరీరం కోసం నాలుగు చిట్కాలు

ఆడపిల్లలు ముద్దబంతిపూలలాగా ఉండటమన్నది ఓల్డ్‌ ఫ్యాషన్‌. నేడంతా నాజూకుదనమే అందం. కానీ ఆధునిక జీవనశైలి, తీసుకునే ఆహారం అందుకు సహకరించవు. స్నేహితులతో కలిసి పిజ్జాలు, బర్గర్లు లాంటి జంక్‌ ఫుడ్‌ను లాగించేస్తూ బరువు పెరిగిపోతున్నామని బాధపడితే లాభం ఉండదు. ఎవరి శరీరం తీరు వారిది అని నిరాశగా నిట్టూరిస్తే సరిపోదు. అలా అని వెంటనే జిమ్‌ను చుట్టి రావడమో, విపరీతమైన డైటింగ్‌లు చేయడమూ సరికాదు. సమతులమైన బరువుతో నాజూకుగా ఉండేందుకు నాలుగే నాలుగు చిట్కాలు ఉన్నాయి. 

విశ్రాంతిగా తినాలి...
సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగాలు చేసే వారు ఇరవై నాలుగు గంటలూ తమ సిస్టమ్‌ల మీద పని చేస్తుంటారు. లంచ్‌టైమ్‌లో కాసేపు ఆ పని నుంచి విరామం తీసుకొని డెస్క్‌కు దూరంగా రావడం మంచిదని ఒక అధ్యయనం పేర్కొంటోంది. అది తక్కువగా ఆహారం తీసుకునేందుకు తోడ్పడుతుందని అధ్యయనంలో తేలింది. అధ్యయనంలో పాల్గొన్న బృందంలో సభ్యులు కొందరు కంప్యూటర్‌ ముందు కూచుని ఏవో గేమ్స్‌ ఆడుతూనో, పని చేస్తూనో తినగా, ఎటువంటి ఆటంకం లేకుండా తిన్నారు. అరగంట తర్వాత ఈ రెండు బృందాలను వారి కడుపునిండడం గురించి ప్రశ్నించగా, ఎటువంటి ఆటంకం లేకుండా తిన్నవారే కడుపు నిండుగా ఉందని సమాధానం ఇచ్చారుట. వారు తర్వాత చిరుతిళ్ళు తిన్నప్పటికీ అవి కొద్దిగా మాత్రమేనట.



నీరు బాగా ఉండే ఆహారం...
నీటి శాతం అధికంగా ఉన్న సూప్స్‌, సలాడ్స్‌, కీర దోసకాయలు, పుచ్చకాయలు వంటివి తీసుకోవడం వల్ల బరువు పెరగదు. తక్కువ కాలరీలతో కూడిన ఈ ఆహారం తీసుకుంటే కడుపు నిండినట్టుగా ఉంటుంది. భోజనం చేసే ముందు సూప్‌ తీసుకున్నా కూడా ఎక్కువ తినలేమట. అలాగే అన్నం తినేముందు రెండు కప్పుల నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారనే విషయం రుజువు అయింది.

తిన్నట్టుగా ఊహించుకోవాలి...
మనం ఆహారం తీసుకోబోయే ముందే దాన్ని తిన్నట్టుగా ఊహించుకుంటే తక్కువగా తింటారుట. ఇది కూడా ఒక అధ్యయనంలో రుజువైన విషయమే. తెలియకుండానే ఎక్కువగా తినేసేవారు తాము తినాలనుకునే తిండిపదార్ధాలను ఊహించుకుంటే దాని పట్ల ఆసక్తి తగ్గి తక్కువగా తింటారుట. అలా కాకపోయినా తినేదాని పట్ల స్పృహ కలిగి అతిగా తినేయరు.

మల్టీవిటమిన్లు తీసుకోవాలి...
బరువు తగ్గడానికి ఎలాంటి మేజిక్‌ పిల్‌లేదు. మల్టీ విటమిన్‌ తీసుకుంటే చాలు బరువు తగ్గుతారుట. చైనాలో 85మంది ఊబకాయ మహిళలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం రుజువైంది.
ఈ మహిళలను రెండు జట్లగా విడదీసి ఒకరికి రోజూ వారు తీసుకునే ఆహారంతో పాటు మల్టీవిటమిన్‌ మాత్రను, మరొక జట్టుకు ఆహారాన్ని మాత్రమే ఇచ్చి పరీక్షించగా, మల్టీవిటమిన్‌ తీసుకున్న వారు ఆరునెలల్లో మూడుననర పౌండ్ల బరువు తగ్గారట. ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఒబేసిటీలో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఇందుకు కారణం విటమిన్లు, మినరల్స్‌ శరీరంలో లోపించినప్పుడు ఆకలి పెరుగుతుందిట.. దానితో ఎలాపడితే అలా తినేయడంతో బరువూ, శరీరమూ కూడా పెరగడం ఒక కారణం కావచ్చని వైద్యులు అంటున్నారు. అన్ని విటమిన్లు, మినరల్స్‌ శరీరంలో ఉన్నప్పుడు అనవసరమైన ఆకలి అనిపించదు కనుక శరీరమూ నాజూకుగా బరువు పెరగకుండా ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top