చైనీస్‌ భేల్‌


కావల్సినవి: 
మరమరాలు - రెండు కప్పులు; మొలకెత్తిన పెసలు - పావు కప్పు; సన్నగా తరిగిన టమాటా ముక్కలు - పావుకప్పు; ఉడికించిన బంగాళాదుంప ముక్కలు - పావు కప్పు; ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరగాలి); ఉడికించిన పచ్చిబఠాణీ, స్వీట్‌కార్న్‌ - గుప్పెడు చొప్పున; టమాటా సాస్‌ - మూడు చెంచాలు; గ్రీన్‌ చిల్లీ సాస్‌, సోయా సాస్‌ - చెంచా చొప్పున; కొత్తిమీర తురుము - పావుకప్పు; నిమ్మకాయ - ఒకటి (రసం తీసుకోవాలి); ఉప్పు - రుచికి సరిపడా.
తయారీ: 
 వెడల్పాటి గిన్నె తీసుకుని మరమరాలు తప్ప మిగిలిన పదార్థాలన్నీవేసి బాగా కలపాలి. వడ్డించే ముందు మరమరాలు కలిపితే సరిపోతుంది. బలవర్థకమైన ఈ బేల్‌ను పిల్లలు ఇష్టంగా తింటారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top